Samantha : టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో విడాకుల అనంతరం స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్‌లో ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే సమంత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఉదయాన్నే నల్గొండ చేరుకున్న సమంత మాంగల్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సమంత రిబ్బన్ కట్ చేసి.. మాంగల్య షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేశారు. సామ్ లో ఈ మధ్య బోల్డ్ నెస్ బాగా పెరిగిపోయింది. చైతో విడాకుల దగ్గర నుంచి ఆమె విపరీతమైన బోల్డ్ నెస్ చూపిస్తూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా పుష్ప మూవీలో ఐటెం సాంగ్‌తో అదరగొట్టిన దగ్గర నుంచి సమంతలో విచ్చలవిడితనం మితిమీరిపోయింది అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా సమంత పాపులారిటీ దేశవ్యాప్తంగా ఆమాంతం పెరిగింది. ఫుల్ స్వింగ్‌లో ఉంది సమంత. ఇప్పుడు వరుసగా సినిమాలను ఓకే చేసేస్తోంది. పైగా ఒక్కో సినిమాకు 3 కోట్లు వరకు తీసుకుంటుంది. తన కెరీర్ ను ఇలాగే కంటిన్యూ చేస్తానంటుంది. ఎలాగూ చేతి నిండా సినిమాలు ఉన్నాయి కాబట్టి.. ఇక వ్యక్తిగత ఇబ్బందులకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది.
కానీ ఆమెకు ఇక ఎన్ని ఛాన్స్ లు వస్తాయి అనేది అనుమానం. సమంత వయసు రీత్యా హీరోయిన్ ఏజ్ ను కూడా దాటేసింది.కాబట్టి మహా అయితే.. మరో రెండేళ్లు ఆమె కెరీర్ ఉంటుంది. అందుకే ఇకనైనా పర్సనల్ లైఫ్ ను చూసుకో’ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

[…] Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ బ్యూటీ ఈషా రెబ్బా గులాబి రంగు దుస్తుల్లో ఒయ్యారాలు పోతూ కనిపిచింది. ఆమె అందం దెబ్బకు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. ఇక తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ టైపింగ్ అనే వ్యాఖ్యను పోస్ట్ చేసింది. […]