
అయితే, మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. బిగ్ బి హిందీ వెర్షన్ కి వాయిస్ ఓవర్ ఇస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు వెర్షన్ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. అమితాబ్ వాయిస్ పై ఆనందం వ్యక్తం చేసిన దర్శకనిర్మాతలు.. మహేష్ వాయిస్ గురించి మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక ‘రాధేశ్యామ్’ కథ.. ఓ రియల్ స్టోరీ అని టాక్ నడుస్తోంది. సినిమా ఓపెనింగ్ లోనే.. ఓ ట్రైన్ 106 మంది ప్యాసింజర్లతో రోమ్ కి బయలుదేరుతుంది. అయితే, అ ట్రైన్ ఓ టన్నేలోకి వెళ్లి తిరిగి బయటకు రాదు. అసలు ఆ ట్రైన్ ఏమైపోయింది ? అందులోని ప్యాసింజర్లు ఏమయ్యారు ? అనే మిస్టరీతో సినిమాలో టెన్షన్ మొదలవుతుంది. నిజానికి ఇది రియల్ స్టోరీ.
అది 1911 వ సంవత్సరం. ఇటలీలో 106 మంది ప్యాసింజర్లతో జనట్టి అనే ఒక ట్రైన్ రోమ్ కి వెళ్తూ.. మార్గ మధ్యంలో లాంబార్టీ మౌంటెన్ వద్ద ఒక పెద్ద టన్నెల్ లోకి వెళ్ళింది. ఐతే, ఇప్పటి వరకూ ఆ ట్రైన్ బయటికి రాలేదు. అసలు ఆ ట్రైన్ ఏమైపోయిందో అని నేటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ మిస్టరీలోని ట్విస్ట్ ఛేదిస్తూ రాధేశ్యామ్ సినిమా ముగుస్తోంది.