Murali Mohan: చలన చిత్ర రంగంలో మురళీమోహన్ ఓ విలక్షణమైన నటుడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించి మంచి మార్కులు కొట్టేసే ఆయనకు కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. సినిమా ప్రారంభమై పూర్తయ్యే వరకు తమ పాత్ర ఉంటుందో లేదో కూడా ఎవరికి అంతుచిక్కదు. అలాంటి ఓ బాధాకరమైన సన్నివేశాన్ని సైతం మురళీమోహన్ జీవితంలో చూడవచ్చు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో పాత్రకు జీవం పోసిన ఘనత ఆయన సొంతం. అలాంటి మురళీమోహన్ కూ ఓ ఘటన చేదు అనుభవమే మిగిల్చింది.

పలు చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు తేజ. చిత్రం మూవీస్ పతాకంపై చిత్రం, నువ్వు నేను, జయం లాంటి చిత్రాలతో దూసుకుపోయారు. అనంతరం నిజం సినిమాను మహేశ్ బాబు హీరోగా తెరకెక్కించారు. ఇందులో రక్షిత కథానాయిక. ఇందులో ద్వితీయ భాగంంలో ఓ పాత్రకు మురళీమోహన్ ను ఎంచుకుని సినిమా దాదాపు పూర్తి చేశారు కానీ మురళీమోహన్ ఈ పాత్రకు న్యాయం చేయలేదని తేజ ఆయనను తొలగించి ఈ పాత్రకు రియల్ స్టార్ శ్రీహరిని సంప్రదించాడు. కానీ శ్రీహరి అప్పటికే బిజీగా ఉండటంతో ప్రకాశ్ రాజ్ ను సూచించారట. దీంతో ఆ పాత్రను ప్రకాశ్ రాజ్ తో చిత్రీకరించి చిత్రాన్ని విడుదల చేసినా అది విజయం సాధించలేకపోయింది.
Also Read: కేసీఆర్ మీడియాపై పడ్డ బీజేపీ.. మూసేస్తుందా?
అప్పటికే ఒక్కడు విజయవంతంగా ప్రదర్శించబడటంతో నిజం సినిమాపై కూడా అంచనాలు బారీగానే ఉన్నా అది జయప్రదం కాలేకపోయింది. కానీ మురళీ మోహన్ మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని సినీ పెద్దలకు ఫిర్యాదు చేసి తనకు రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సినీ పరిశ్రమ పెద్దలు రాజీ కుదర్చి రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిర్చారు. దీంతో సినిమా పరిశ్రమలో ఎవరికైనా కష్టాలు తప్పవనే వాదనలు నిజమే అనిపిస్తోంది.

మురళీమోహన్ బాడీ లాంగ్వేజ్, లిప్ మూమెంట్ సరిగా లేవనే కారణంతో తేజ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తేజ తీరుకు అందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత్ర కోసం ఎంపిక చేసుకునేటప్పుడే అన్ని చూసుకోవాలి కానీ తరువాత ఓ నటుడిని పాత్ర నుంచి తొలగించడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో మురళీమోహన్ కు అందరు అండగా నిలిచినా ఇలా ప్రవర్తించడంపై చిత్ర పరిశ్రమ కూడా ఉలిక్కిపడింది.
Also Read: భారీ స్కాంలో సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య.. అసలు ఆమె ఏం చేసిందో తెలుసా?