సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది, సంవత్సరాలు గడుస్తున్నా.. వారి బంధం మాత్రం ఇంకా బలపడుతూనే ఉంది. రజిని ఎప్పుడూ హైదరాబాద్ వచ్చినా.. ముందుగా మోహన్ బాబు ఇంటికి వెళ్లడం అలవాటు. పైగా రజినీకాంత్ కి మోహన్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మంచి రిలేషన్ ఉంది.
కాగా నిన్నటివరకూ రజినీకాంత్ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన హీరోగా, శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజిని దాదాపు పదిహేను రోజులు పాటు సిటీలో ఉన్నారు. అయితే, నిన్నటితో ఈ సినిమా షూటింగ్ ముగిసింది. చెన్నై వెళ్ళిపోతూ హైదరాబాద్ లోని తన ప్రియ స్నేహితుడు మోహన్ బాబును కలవడానికి సరదాగా ఆయన ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో రజినీకాంత్ తో ఫోటోలు దిగింది మంచులక్ష్మీ. పైగా తన కుమార్తెని కూడా రజినీతో ఫోటో తీయించింది. ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త బాగా వైరల్ అవుతున్నాయి. అయితే, మంచు లక్ష్మి పోస్ట్ చేసిన ఫోటో కింద కొంత మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ‘జాగ్రత్త మంచు అక్క, దయచేసి రజినీకి నీ సినిమాలు చూపించకు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇక రజినీకాంత్ వచ్చే నెల నుండి మళ్ళీ పది రోజుల పాటు షూటింగ్ హైదరాబాద్ లో చేయనున్నారు. ఆ షెడ్యూల్ తో దాదాపు ‘అన్నాత్తే’ సినిమా ముగుస్తోంది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఖుష్బూ – రజిని మధ్య కెమిస్ట్రీ చాల బాగా ఆకట్టుకునేలా ఉంటుందట. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
🥰❤️ pic.twitter.com/axCa7I6H08
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) May 12, 2021