https://oktelugu.com/

ఆస్పత్రికెళితే హరీనే.. ఇంట్లోనే చికిత్స బెటర్

కరోనాతో దేశంలో, రాష్ట్రాల్లో పరిస్థితులు భీతావాహంగా కనిపిస్తున్నాయి. ఇంటి నుంచి కాలు బయటపెడితే చాలు వారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేని విధంగా పరిస్థితులు తయారవుతున్నాయి. దేశంలో పాజిటివ్ రేట్ 21శాతానికి చేరుకుంది. గోవాలో 40శాతం మించిపోయి దేశంలోనే అత్యధికంగా ఉంది. నిజానికి 12 శాతం దాటితే లాక్ డౌన్ పెట్టేయాల్సింది. కానీ అంతుకుమించిన తీవ్రత ఉన్నా కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక రాష్ట్రాలు మాత్రం తమ రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 13, 2021 / 12:01 PM IST
    Follow us on

    కరోనాతో దేశంలో, రాష్ట్రాల్లో పరిస్థితులు భీతావాహంగా కనిపిస్తున్నాయి. ఇంటి నుంచి కాలు బయటపెడితే చాలు వారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేని విధంగా పరిస్థితులు తయారవుతున్నాయి. దేశంలో పాజిటివ్ రేట్ 21శాతానికి చేరుకుంది. గోవాలో 40శాతం మించిపోయి దేశంలోనే అత్యధికంగా ఉంది.

    నిజానికి 12 శాతం దాటితే లాక్ డౌన్ పెట్టేయాల్సింది. కానీ అంతుకుమించిన తీవ్రత ఉన్నా కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

    ఇక రాష్ట్రాలు మాత్రం తమ రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా లాక్ డౌన్ పెట్టేశాయి. ఇప్పటికే దేశంలోని 18 రాష్ట్రాలు పెట్టేశాయి. మరికొన్ని కూడా ఆంక్షలు, పాక్షిక లాక్ డౌన్ బాటపట్టాయి.

    ప్రస్తుతం కరోనా అని తేలితే ఆస్పత్రికెళితే పై ప్రాణాలు పైనే పోయే ప్రమాదంలో పడ్డాయి. ఎందుకంటే కరోనా భయం మా చెడ్డది. ఆస్పత్రులు ప్రస్తుతం రోగిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆ టెస్టులు, ఈ టెస్టులు, బెడ్ ఖరీదు, రెమెడిసివిర్, స్కానింగ్, మాత్రలు అంటే ఎక్స్ ట్రా ఖర్చును రోగిపై వేస్తున్నాయి. దీంతో లక్షలు వదిలించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

    ఇక కుటుంబం కూడా ఈ కరోనా కల్లోలంలో తమ వారిని ఆస్పత్రిలో వదిలేసి దగ్గరగా చూసుకోలేని పరిస్థితి. ఇక ఆస్పత్రిలో రోగులు పోటెత్తడంతో అస్సలు పట్టించుకునే పరిస్థితులు లేవు. దీంతో ఆస్పత్రికెళితే ఆ భయం, ఆందోళన, ఖర్చులు చూసి పైప్రాణాలు పైనే పోతున్నాయి. అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తున్నా సరైన వైద్యం అందక చాలా మంది ప్రాణాలు పోతున్నాయి.

    సో ఈ టైంలో కరోనా వచ్చిందని కంగారు పడకుండా కరోనాను తగ్గించే మందులను ప్రభుత్వాసుపత్రుల్లో కానీ.. లేదా డాక్టర్ల సలహాపై వాడి బలమైన ఆహారం తీసుకొని తగ్గించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రోగులందరూ ఆస్పత్రులకు పోటెత్తిన వేళ ఈ టైంలో ఆస్పత్రికి వెళ్లడం అంత మంచిది కాదని అంటున్నారు.