Hero Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ “హీరో” అనే చిత్రంతో ఈ సంక్రాంతికి హీరోగా పరిచయం అవుతున్నాడు. కాగా జనవరి 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అందుకే, ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలో రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ బాగానే ఉంది.

ట్రైలర్ లో మెయిన్ గా లవ్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన ఎలివేషన్ షాట్స్ ను బాగా కట్ చేశారు. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగినా.. కావాలని అన్ని కమర్షియల్ హంగుల కోసం కొన్ని అనవసరమైన షాట్స్ ను జోడించారు. ముఖ్యంగా ట్రైలర్ లో సంభాషణలు పేలవంగా ఉన్నాయి. కథానాయకుడిగా కనిపించడానికి అశోక్ గల్లా బాగా కష్టపడ్డాడు. కాకపోతే కష్టపడితే బాడీ వస్తోంది గానీ, యాక్టింగ్ రాదు కదా.
అన్నట్టు ట్రైలర్ ను బట్టి కథ విషయానికి వస్తే.. హీరో అవ్వాలనుకునే ఓ కుర్రాడి కథనే కాస్త కమర్షియల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. కానీ అశోక్ గల్లా లుక్స్, నటన ఇంకా బెటర్ కావాలి. శ్రీరామ్ ఆదిత్య కూడా దర్శకత్వం పరంగా ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది. ట్రైలర్ లో నిధి అగర్వాల్ చాలా అందంగా కనిపించింది.
Also Read: మహేష్ మేనల్లుడు ‘హీరో’కి రాజమౌళి సాయం !
కాకపోతే, అలా కనిపించడానికి ఓవర్ గా మేకప్ వేసుకుంది. ఇక ట్రైలర్ మొత్తంలో హైలైట్ గా నిలిచింది మాత్రం జగపతిబాబునే. ఆయన నటన బాగుంది. వెన్నెల కిషోర్ కూడా తన గెటప్ తో ఆకట్టుకున్నాడు. కాగా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడిగా కంటే.. హీరో మహేష్ బాబు మేనల్లుడిగానే అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
పైగా బోల్డ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ గా కనిపించబోతుంది. ఇక ఈ సినిమా కోసం నిధి బికినీ కూడా వేసిందని.. అలాగే మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసిందని.. అది సినిమాలో హైలైట్ చేయడానికి సీక్రెట్ గా ఉంచారని తెలుస్తోంది.
Also Read: పాత వాటితోనే ఖుషీ అవుతున్న ‘సల్మాన్ – మహేష్’ ఫ్యాన్స్ !

[…] […]