Allu Arvind: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పుట్టిన రోజు నేడు (జనవరి 10). ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరీర్ తొలినాళ్లలో పలు సినిమాల్లో నటుడిగా కన్పించారు. ఆ తర్వాత సినీ నిర్మాణం వైపు అడుగులు వేసి అనతీకాలంలో అగ్ర నిర్మాతగా ఎదిగారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో సినిమాలను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీకి మరిచిపోలేని హిట్స్ ను అందించారు.

అల్లు అరవింద్ నిర్మాత వ్యవహరించిన సినిమాల్లో దాదాపు అన్ని చిత్రాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. వందలో 90శాతం సక్సస్ రేటు ఉన్న నిర్మాత అల్లు అరవింద్ అంటే అతిశయోక్తి కాదు. సినిమాల పట్ల ఆయనకు ఉన్న జడ్జిమెంట్ అలాంటిదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అల్లు అరవింద్ మెగాస్టార్ తో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ నిర్మించారు. వీరి కాంబినేషన్ కు అప్పట్లో ఎదురు లేకుండా పోయింది.
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక వీళ్ల కాంబినేషన్ మళ్లీ రీపిట్ కాలేదు. అయితే వీరి కాంబినేషన్ చూడాలని మాత్రం అభిమానులు కోరుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో చాలా మంది నిర్మాతలు సినిమాలతో నష్టపోతుండగా అల్లు అరవింద్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కేవలం తెలుగు కంటెంట్ కోసం ప్రత్యేకంగా ‘ఆహా’ను తీసుకొచ్చిన సంగతి అందరికీ తెల్సిందే.
ఈ సమయంలో ఎన్నో సినిమాలను ‘ఆహా’ కోసం కొనుగోలు చేసి లాక్డౌన్ సమయంలో పలువురు నిర్మాతలను ఆదుకున్నారు. అలాగే ‘ఆహా’ కోసం వెబ్ సిరీసులు, సినిమాలు నిర్మిస్తూ లాక్డౌన్లోనూ ఎంతోమందికి ఉపాధిని కల్పించారు. ఇదంతా ఆయన ముందుచూపుకు నిదర్శనంగా నిలుస్తోంది. ‘ఆహా’ ఓటీటీకి అల్లు అరవింద్ భారీగా ప్రమోషన్స్ చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
ఇటీవల నందమూరి బాలకృష్ణతో అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ‘ఆహా’ కోసం ప్లాన్ చేశారు. ఈ షోకు అభిమానులను నుంచి మంచి స్పందన లభించడం సబ్ స్కైబర్లు భారీగా పెరిగాయి. తమన్నా, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ‘ఆహా’ కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్ నిఖిల్ తో ‘18పేజేస్’, అల్లు శిరీష్ , వరుణ్ తేజ్ లతో పలు సినిమాలు నిర్మిస్తూ ఈ వయస్సులోనూ బీజీబీజీగా గడుపుతున్నారు.