Raghurama and Jagan: నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ రఘురామ కృష్ణం రాజు వైసీపీకి సవాలు విసురుతున్నారు. దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయించాలని సూచిస్తున్నారు. ఇన్నాళ్లు తనపై అనర్హత వేటు వేయించడానికి నానా తంటాలు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే రఘురామ రాజీనామా చేస్తారనే ప్రచారం వస్తున్న సందర్భంలో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో అని అందరిలో అనుమానాలు నెలకొన్నాయి. అయితే రఘురామ మాత్రం ప్రభుత్వానికి చాలెంజ్ చేస్తున్నారు.
వచ్చే నెల ఐదు లోపు తనపై అనర్హత వేటు వేయించకపోతే తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళతానని చెబుతున్నారు. అమరావతి అంశాన్ని ప్రధానంగా చేసుకుని ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతానని దీమా వ్యక్తం చేస్తున్నారు. తనపై అనర్హత వేటు వేయించాలనే తపనతో సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, స్పీకర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ లోపాలను ఎత్తి చూపుతూ రఘురామ విమర్శలు చేస్తున్నారు.
Also Read: పొత్తుకు జనసేన షరతులు.. చంద్రబాబు ఓకే చెప్పేనా?
అమరావతి రాజధాని విషయంపైనే రఘురామ పోరాటం చేయనున్నారు. రాజీనామా చేస్తే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉప ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లు వైసీపీ ఎంపీగా పేరుండటంతో ఇప్పుడు ఆ పేరును తొలగించుకోవాలని చూస్తున్నారు. అమరావతికి మద్దతుగా తిరుపతిలో జరిగిన సభలో రైతులకు మద్దతు ప్రకటించి తన వైఖరి స్పష్టం చేశారు.
ప్రస్తుతం డెడ్ లైన్ విధించి తనపై అనర్హత వేటు వేయడానికి వైసీపీకి గడువు పెట్టారు. ఫిబ్రవరి 5 లోపు తనపై అనర్హత విధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో రాజకీయ పరిణామాలు ఎటు వైపు వెళతాయో తెలియడం లేదు. దీంతో వైసీపీ రఘురామ విషయంలో ఏ మేరకు స్పందించి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: కరోనా కట్టడికి ఏపీ సర్కారు కఠిన ఆంక్షలు..