‘ఎన్టీఆర్’లో వేరియేషన్స్.. స్క్రిప్ట్ వర్క్ లో కొరటాల !

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఒక పాన్ ఇండియా మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం కొరటాల ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు. కాగా స్క్రిప్ట్ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో కొరటాల ఈ సినిమా కథ రాసుకున్నారని.. కథా నేపథ్యంలో తెలుగుతనం తేవడానికి పలనాటి ప్రాంతాన్ని తన సినిమా నేపథ్యంగా […]

Written By: Raghava Rao Gara, Updated On : April 18, 2021 8:04 pm
Follow us on


‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఒక పాన్ ఇండియా మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం కొరటాల ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు. కాగా స్క్రిప్ట్ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో కొరటాల ఈ సినిమా కథ రాసుకున్నారని.. కథా నేపథ్యంలో తెలుగుతనం తేవడానికి పలనాటి ప్రాంతాన్ని తన సినిమా నేపథ్యంగా తీసుకున్నారని టాక్ నడుస్తోంది.

అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి సెంటిమెంట్ లేని పర్సన్ లా కనిపించబోతున్నాడట. అంటే తారక్ పాత్ర పూర్తి ఆధ్యాత్మికంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే సగం స్క్రిప్ట్ వర్క్ ను కొరటాల దాదాపు పూర్తి చేశారట. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా కొరటాల మెసేజ్ తో సాగే పక్కా ఎంటర్ టైనర్ గా తీస్తాడట. అన్నట్టు ప్రస్తుత సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు, వారి మనస్తత్వాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను కూడా వ్యంగ్యంగా చెబుతూ కొరటాల ఈ సినిమాని నడిపిస్తాడట.

మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా కొరటాల ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. పైగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అన్నిటికి మించి ‘లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ కొరటాల ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ రూపంలో చెప్పిన సంగతి తెలిసిందే.