ఫలితంగా.. అన్ని రంగాలపై ప్రభావం మొదలైంది. మహారాష్ట్ర వంటి చోట్ల థియేటర్లు, షూటింగులు, వ్యాపారాలు అన్నీ మూసేశారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ కఠిన నిబంధనలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే.. జూనియర్ ఎన్టీఆర్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’పైనా కరోనా ప్రభావం పడినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి గతంలో లక్షలాది దరఖాస్తులు వచ్చేవి. తొలి దశలో వాటిని నిర్వాహకులు పరిశీలించి, ఫైనల్ చేసేవారు. ఆ తర్వాత రెండో దశలో వారిని ఇంటర్వ్యూలకు పిలిచేవారు. అలా ఫైనల్ అయిన వారు షోకు హాజరయ్యే వారు. ఇంత కాంపిటేషన్ ఉండే ఈ షోకు ఈ సారి కేవలం వందల్లోనే దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది.
కరోనా కారణంగా.. బయటకు వచ్చేందుకు జనాలు భయపడుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అదేకాకుండా.. ఇలాంటి షోలపై గతంలో మాదిరిగా జనాలకు ఆసక్తి లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ రెండు కారణాలతో ఔత్సాహికుల సంఖ్య తగ్గిందని అంటున్నారు. మరి, ఇంతకీ షో జరుగుతుందా? వాయిదా పడుతుందా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.