‘కీర్తి సురేష్’ మహానటి అంటూ నేషనల్ రేంజ్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. పైగా ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ ది కీలకమైన పాత్ర. మహేష్ కి సమానంగా ఈ రోల్ ఉంటుందట. ఇక అలాగే, సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో కూడా కీర్తి సురేష్ నటిస్తోంది.
ఈ సినిమాలో నయనతార, మీనాతో కలిసి కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అలాగే, విజయ్ తో కూడా కీర్తి సురేష్ నటించే ఛాన్స్ వచ్చింది. గతంలో కూడా కీర్తి, విజయ్ తో కలిసి నటించింది. విజయ్ తదుపరి చిత్రంలో కీర్తి సురేష్ నటించడానికి అంగీకరించింది. ఐతే, విజయ్ నెక్స్ట్ మూవీ లోకేష్ కనగరాజ్ తో ఉంటుందా? లేక వంశీ పైడిపల్లితోనా అనేది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి,
ప్రస్తుతానికి ఆమె ఎవరి సినిమాలో నటిస్తోందో తెలియలేదు. విజయ్ మాత్రమే కీర్తికి ఆఫర్ ఇచ్చాడు. డైరెక్టర్ ఎవరు అయినా హీరోయిన్ మాత్రం కీర్తి సురేష్ నే. అయితే ఈ ఇద్దరి దర్శకులలో విజయ్, వంశీ పైడిపల్లి సినిమానే ముందు మొదలుపెట్టే అవకాశం ఉంది.
దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా గతంలో మొదట మహర్షి సినిమాలో కీర్తి సురేష్ నే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు మహేష్ – వంశీ పైడిపల్లి సినిమాలో ఛాన్స్ మిస్ అయింది. ఎలాగూ సర్కారులో మహేష్ సరసన చేస్తోంది, ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమాలో కూడా హీరోయిన్ నటిస్తోంది.