https://oktelugu.com/

“అసలు అదేం కథండీ.. అయినా ఘన విజయమా !

తెలుగు పాత చిత్రాల్లో మరో ఆణి ముత్యం లాంటి సినిమా ‘గుండమ్మ కథ’. పైగా ఆ రోజుల్లో చివరి విజయవంతమైన నలుపు తెలుపుల చిత్రం కూడా ఈ సినిమానే కావడం విశేషం. దీనికితోడు నిజమైన మల్టీ స్టారర్ గా వచ్చిన ”గుండమ్మ కథ” సినిమా సూర్యకాంతం అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రాధాన్యతతో పైగా ఆ పాత్ర పేరుమీదుగానే సినిమా రావడం ఇప్పటికీ గొప్ప వైవిద్యమే. ఇక ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ […]

Written By:
  • admin
  • , Updated On : March 28, 2021 / 10:33 AM IST
    Follow us on


    తెలుగు పాత చిత్రాల్లో మరో ఆణి ముత్యం లాంటి సినిమా ‘గుండమ్మ కథ’. పైగా ఆ రోజుల్లో చివరి విజయవంతమైన నలుపు తెలుపుల చిత్రం కూడా ఈ సినిమానే కావడం విశేషం. దీనికితోడు నిజమైన మల్టీ స్టారర్ గా వచ్చిన ”గుండమ్మ కథ” సినిమా సూర్యకాంతం అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రాధాన్యతతో పైగా ఆ పాత్ర పేరుమీదుగానే సినిమా రావడం ఇప్పటికీ గొప్ప వైవిద్యమే. ఇక ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో కొత్త రికార్డ్ లను సృష్టించింది ఈ సినిమా.

    పైగా విచిత్రం ఏమిటంటే.. ఈ సినిమాని ఇప్పుడు టీవీల్లో వేసిన టీఆర్పీ రేటింగ్ బాగా వస్తోందట. అంత గొప్ప సినిమా ఇది. అయితే మొదట ఈ సినిమా చూసిన వాళ్ళు అంతా ఇది పెద్ద ప్లాప్ సినిమా అని తేల్చిపారేశారట. పైగా ప్లాప్ సినిమా అని చెప్పిన వాళ్ళల్లో లెజెండరీ దర్శకుడు కూడా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అది గుండమ్మ కథ రిలీజ్ కి రెడీ అవుతోన్న రోజులు. ఇంకా పదిరోజుల సమయం మాత్రమే ఉంది.

    ఈ లోపు ఎల్వీ ప్రసాద్ ఇంట్లో ఓ పెళ్లి జరుగుతుంది. విజయావారికి ప్రసాద్ గారితో మంచి అనుబంధం ఉంది. దాంతో ఆ పెళ్లి వేడుకల్లో విజయావారు గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. అక్కడ ఆ సినిమా చూసిన సినిమా ప్రముఖులు చాల విమర్శలు చేశారట. సినిమాలో అసలు కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా చూపించలేకపోయారని.. అలాగే హరనాథ్-విజయలక్ష్మి పాత్రలు అసలు కథకే అనవసరమని ఇలా చాల విమర్శలనే చేసుకుంటూపోయారు.

    అయితే, ఆ విమర్శలు చేసినవాళ్ళల్లో ‘మాయాబజార్’ పాతాళభైరవి లాంటి గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి కూడా సినిమా అసలు బాగోలేదు అంటూ.. “అసలు అదేం కథండీ! కృష్ణా, ఓ వర్గం కథలా వుంది. డైలాగులు బాగున్నాయనుకోండి. కానీ ఒక్క డైలాగులతోనే పిక్చర్ నడుస్తూందా” అని విమర్శలు చేశారట. కానీ సినిమా విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా ఘన విజయం సాధించిన తరువాత కూడా కేవీ రెడ్డి ‘ఏంటోనండి. ఈ సినిమా జనం ఎందుకు చూస్తున్నారో అర్థంకావట్లేదు అంటూ గుండమ్మకథ సినిమా పై ఆయన చివరి వరకూ విమర్శలు చేశారట.