FIR registered: దేశంలో థర్డ్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గడిచిన రెండు మూడ్రోజులుగా దేశంలో రోజుకు లక్షకు పైగానే కొత్త కేసులు నమోదు అవుతుండటం ఆందోళనను రేపుతోంది. ఈక్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, పాక్షిక లాక్డౌన్ దిశగా వెళుతున్నాయి.
ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఒమ్రికాన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఈక్రమంలోనే రాజకీయ సభలు, సమావేశాలు, విందులు, వినోదాల వంటి కార్యక్రమాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు.
Also Read: షాకింగ్ : ప్రముఖ స్టార్ హీరో మృతి !
కర్ణాటకలో తాజాగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు ప్రముఖ నటులపై అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నటుడు దునియా విజయ్, కమెడియన్, మ్యూజిక్ డైరెక్టర్ సాధు కోకిల కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి మేకేదత్తు పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో శాతనూర్ పోలీసులు ఈ ఇద్దరిపై ఐపీసీ 143, 336, కర్ణాటక ఎపిడమిక్ వ్యాధుల చట్టం కిందో మరో కేసు నమోదు చేశారు.
ఈ కార్యక్రమం కంటే ముందుగా సాధు కోకిల మాట్లాడుతూ తాను సినిమా వ్యక్తి కాకుండా ఓ పౌరుడిగా మాత్రమే మేకేదత్తు పాదయాత్రలో పాల్గొన్నట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమాన్ని హీరో శివరాజ్ కుమార్ జెండా ఊపి ప్రారంభిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆయన ఈ కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. మరోవైపు పోలీసులు తమపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్ పై మాత్రం ఇద్దరు నటులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.
Also Read: శృంగార తారతో రవితేజ స్టెప్పులు.. ఏమిటి ఈ దౌర్భాగ్యం ?