MP Raghuram: నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ రఘురామ కృష్ణంరాజు మరోసారి వార్తల్లో నిలవనున్నారు. ఇప్పటికే పలుమార్లు సంచలనాలు సృష్టించిన రఘురామ మరోమారు తెరమీదకు రానున్నారు. హైదరాబాద్ కు చేరుకున్న రఘురామ ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు తీసుకొచ్చారు. ఆయనకు ఇచ్చేందుకు ఇంటి వద్దే ఉన్నారు. కానీ రఘురామ మాత్రం బయటకు రాలేదు. దీంతో వారు ఇంటి ఎదుటే ఆయన కోసం ఎదురు చూస్తున్నారు.

తిరుపతిలో జరిగే అమరావతి సభలో పాల్గొనేందుకు ఏపీకి వచ్చిన ఆయన హైదరాబాద్ కు రావడంతో ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడానికి వచ్చినట్లు తెలుస్తోంది. రఘురామ మాత్రం బయటకు రావడం లేదు. దీంతో సీఐడీ అధికారులు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. సీఐడీ అధికారులు నోటీసులు తీసుకురావడంతో చర్చనీయాంశం అవుతోంది.
Also Read: ‘సూపర్ మచ్చి’ ట్రైలర్ కు కనెక్ట్ అయిన ఫ్యాన్స్..!
గతంలో కూడా రఘురామ కృష్ణంరాజును సీఐడీ పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆయన పోలీసుల చేతికి చిక్కేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. కానీ సీఐడీ అధికారులు మాత్రం నోటీసులు ఇవ్వడానికే వచ్చినట్లు చెబుతున్నా ఎంపీ మాత్రం వారి మాటలు విశ్వసించడం లేదు. మరోసారి అదుపులోకి తీసుకుంటే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
మొత్తానికి రఘురామ వ్యవహారంలో సీఐడీ అధికారులు నోటీసులు ఇస్తామని చెబుతున్నా అందులో నిజమెంతో అబద్దమెంతో అర్థం కావడం లేదు. ప్రస్తుతం రఘురామ ఏం చేయబోతున్నారు? సీఐడీ అధికారులు ఏ మేరకు స్పందించనున్నారు? అనే వాటిపై ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రఘురామ వ్యవహారంల ఏం జరగబోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: దొంగలతో జతకట్టినా కేసీఆర్ కు ప్రయోజనముండదు?

[…] FIR registered: దేశంలో థర్డ్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గడిచిన రెండు మూడ్రోజులుగా దేశంలో రోజుకు లక్షకు పైగానే కొత్త కేసులు నమోదు అవుతుండటం ఆందోళనను రేపుతోంది. ఈక్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, పాక్షిక లాక్డౌన్ దిశగా వెళుతున్నాయి. […]
[…] KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతు వ్యతిరేకమని నిరసన తెలిపారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదని విమర్శించారు. ఎరువుల ధరలు పెంచి అన్నదాత నడ్డీ విరుస్తున్నారని మండి పడ్డారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పిన కేంద్రం, వ్యవసాయ ఖర్చులు పెంచడం దుర్మార్గమైన చర్య అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. […]