Don’t trouble the trouble: మలయాళం లో ప్రముఖ నటుడు ఫహద్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి కుటుంబం సందడి చేసింది. వారణాసి సినిమా షూటింగ్ బిజీగా సాగుతున్నప్పటికీ రాజమౌళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రమా రాజమౌళి.. వల్లి కీరవాణి.. కాలభైరవ.. కార్తికేయ.. ఆయన సతీమణి.. ఇంకా చాలామంది రాజమౌళి కుటుంబానికి సంబంధించిన వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తే కుటుంబం మొత్తం ఆ సినిమాకు సంబంధించిన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. డోంట్ ట్రబుల్ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాజమౌళి కుటుంబం మొత్తం హాజరు కావడం చర్చకు దారితీసింది. అయితే రాజమౌళి కుటుంబం ఈ సినిమా వ్యవహారంలో ఎందుకు పాలుపంచుకుంది.. రాజమౌళి దర్శకత్వం వహించకపోయినప్పటికీ ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చింది అంటే..
ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన వారిలో ఎస్ఎస్ కార్తికేయ ఒకరు. ఆయన రాజమౌళి కుమారుడు. రాజమౌళి సోదరుడు ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందించారు. రాజమౌళి భార్య రామా రాజమౌళి ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. రాజమౌళి మేనల్లుడు ఏలేటి శశాంక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంటే ఈ సినిమాలో మొత్తం రాజమౌళి కుటుంబం ప్రత్యక్షంగా, పరచంగా ఇన్వాల్వ్ అయి ఉంది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఇటీవల కాలంలో వినూత్నంగా చేపట్టారు. జీ తెలుగులో ప్రసారమయ్యే రియాల్టీ షోలలో.. స్టార్ మా లో ప్రసారమయ్యే రియాల్టీ షోలలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహించారు. ఇటీవల ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. మొత్తానికి నిర్మాతలలో ఒకరైన కార్తికేయ తన బిజినెస్ మైండ్ సెట్ మొత్తాన్ని ఈ సినిమా ప్రమోషన్ కు వాడారు. ఏకంగా రాజమౌళి కుటుంబం మొత్తం ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొంది అంటే మామూలు విషయం కాదు. పైగా ప్యారడైజ్ లాంటి సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మంచి బజ్ సొంతం చేసుకుంది.
సినీ విశ్లేషకులు కూడా ఈ సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. మలయాళ నటుడు ఫహద్ ఇందులో కీలకపాత్ర పోషిస్తూ ఉండడం.. అతడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడుగా ఉండడంతో.. మంచి వసూళ్లు సాధ్యమని చర్చ నడుస్తోంది..
ఇటీవల ప్రమోషనల్ ఈవెంట్లో నాగార్జున సైతం కనిపించారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. తద్వారా వేదిక మొత్తాన్ని సందడిగా మార్చారు. ఆయన స్పీచ్ తో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. కార్తికేయ కుమారుడు జస్ట్ ఒక ఫోన్ చేయగానే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ రెక్కలు కట్టుకొని వాలిపోయారు. రాజమౌళి కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి నిరూపించుకున్నారు. రాజమౌళి కుటుంబం ప్రత్యక్షంగా.. పరోక్షంగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాలో భాగస్వామ్యం అయిన నేపథ్యంలో.. ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమా చూసిన కొంతమంది విశ్లేషకులు సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Man of the masses #JrNTR, came to support Fahad Faasil at the pre-release event of “Dont Trouble the trouble” pic.twitter.com/tb9FGKQmve
— Bollywood Talkies (@bolly_talkies) September 29, 2026
జాగ్రత్తగా వెళ్ళండి.
Don’t Trouble The Trouble – #NTR pic.twitter.com/KPHBZ8oIY4
— Filmy Bowl (@FilmyBowl) September 29, 2026
Don’t trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. Anduke Asian Cinemas lo ee cinema chudandi
#asiancinemas #dontroublethetrouble #fahadfaisal #DTTonOct2nd #dtttmovie pic.twitter.com/DnR8Luwp94
— Asian Cinemas (@AsianCinemas_) September 29, 2026