
‘వకీల్ సాబ్’ సినిమా అనగానే ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ మాత్రమే హైలైట్ అవుతున్నారు గానీ, అసలు ఈ సినిమా వెనుక కర్త కర్మ క్రియ అయిన ద గ్రేట్ నిర్మాత ‘దిల్ రాజు’ ఉన్న సంగతి ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. అసలు దిల్ రాజు ఒక సినిమాని నమ్మి నిర్మించాడు అంటే.. ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. అలాంటది దిల్ రాజు గతంలో ఏ సినిమాకి లేని అంత నమ్మకంగా వకీల్ సాబ్ సినిమా పై ఉన్నాడు. అయినా ఎందుకుండొడు చెప్పండి? అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తే ఆదివారం వరకు వకీల్ సాబ్ టికెట్స్ నిండిపోయాయి.
అసలు కొత్తగా ఎన్ని షోలు యాడ్ చేసినా అంతకంటే ఫాస్ట్ గా ఫిల్ అయిపోతున్నప్పుడు ఏ నిర్మాత మాత్రం ఎందుకు ఆనందంగా ఉండడు. పైగా కరోనా తర్వాత డల్ అయిపోయిన యూఎస్ మార్కెట్ కూడా ఒక్కసారిగా పైకి లేచింది. ఆమెరికాలో కూడా బుకింగ్స్ ఇక్కడ ఉన్నట్టే ఉన్నాయట. మరి దిల్ రాజు ఆనందంగా నమ్మకంగా ఇక ఎందుకు ఉండడు. ఏది ఏమైనా వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్, ట్రైలర్ కి వచ్చే రెస్పాన్స్ ని చూసి అంచనా వేస్తే.. ఈ సినిమాకి వచ్చే ఓపెనింగ్స్ మరో ఏ సినిమాకి వచ్చేలా లేవు. గతంలోని రికార్డ్స్ ను ఈ సినిమా బ్రేక్ చేసేలా ఉంది.
మొత్తానికి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం తన డ్రీం అని 22 ఏళ్లుగా అనుకుంటున్నానని చెప్పిన దిల్ రాజుకి.. ఈ సినిమా కాసుల పంట పండించేలా ఉంది. కరోనా వల్ల సినిమా ఏడాది ఆలస్యం అయినా.. అంతకుమించిన కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి. పైగా పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.. వన్ వీక్ వరకూ ఈ క్రేజ్ ఇలాగే ఉండే అవకాశం ఉంది. అన్నట్టు పింక్ స్ఫూర్తి దెబ్బతినకుండా శ్రీరామ్ వేణు ఈ సినిమాని తీశాడట. మరి పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కాబట్టి.. థియేటర్స్ లో పూల వర్షం కురవడం ఖాయం.