
వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడిగా ధనుష్ కి విభిన్నమైన క్రేజ్ ఉంది. మొత్తానికి ధనుష్ ఏమి చేసినా కొత్తగానే చేస్తాడు. ఇప్పుడు తన సినిమాల రిలీజ్ విషయంలో కూడా కాస్త కొత్తగానే ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ తో అందరు స్టార్ హీరోలు తమ సినిమాల రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంటూ టైం పాస్ చేస్తుంటే.. ధనుష్ మాత్రం తన సినిమాలను వరుసగా రిలీజ్ చేస్తున్నాడు.
ఇప్పటికే ‘కర్ణన్’ సినిమాని రిలీజ్ చేశాడు. ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీ వేదిక పై తన కొత్త సినిమా ‘జగమే తంత్రం’ని కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుక్కుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘పేట్టా’ చిత్రాన్ని తీసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి దర్శకుడు.
ఇక ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. కథ విషయానికి వస్తే.. తమిళనాడు నుంచి లండన్ కి వెళ్లి అక్కడ మాఫియా నాయకుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథ ఇది, మాఫియా లీడర్ గా ధనుష్ పూర్తిగా కొత్త నటన చూపించబోతున్నాడు. ట్రైలర్ షాట్ మేకింగ్ తో పాటు ధనుష్ గెటప్ అండ్ లుక్స్ కూడా సినిమా పై ఆసక్తిని పెంచాయి.
ముఖ్యంగా సినిమా, సినిమాకి ఎన్నుకునే కథలతో పాటు తన నటనా సామర్ధ్యాన్ని పెంచుకుంటూ పోతోన్న ధనుష్, ఈ సినిమాలో చూపిన వైవిధ్యం అద్భుతంగా ఉంటుందట. ఇక ఈ సినిమా ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా రిలీజ్ కాబోతుంది. సినిమా పై ఎలాగూ భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి, వ్యూస్ పరంగా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.