‘ఉప్పెన’ టాలీవుడ్ ను ఊపేసింది. నూతన నటీనటులు, నూతన దర్శకుడు చేసిన ఒక కొత్త ప్రయోగం హిట్ అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కాసులు కురిపించింది. కరోనా కల్లోలం తర్వాత వచ్చిన ఈ తొలి మూవీకి ప్రేక్షకులు ఊహించని విజయాన్ని అందించారు. సున్నితమైన అంశాన్ని తీసుకొని కథగా మలిచిన దర్శకుడు బుచ్చిబాబు తీరుపై ప్రశంసలు కురిశాయి.
మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చబాబు దర్శకత్వంలో తీశారు. అయితే ఈ సినిమా ఊహించని విజాయన్ని అందుకొని ఈ సంవత్సరంలోనే అతిపెద్ద సినిమాగా అవతరించింది. ఈ సినిమాలోని ప్రతీ సీన్ హైలెట్ గానే నిలుస్తుంది. కానీ ఇందులో కొన్ని డిలీట్ చేసిన సీన్స్ ను తాజాగా విడుదల చేశారు. అవిప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి.
రెండున్నర గంటల సినిమా అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఎక్కువగా తీస్తుంటారు. ఈ సినిమా కూడా నారేషన్ మొత్తం మూడు గంటలు దాటిందట.. అయితే దానిని అవసరమైనంత వరకు ఎడిటింగ్ చేసి కొన్ని సీన్స్ కత్తిరించేశారు. ‘ఉప్పెన’ సినిమాలను కూడా రెండున్నర గంటలకు కుదించారు.. డైరెక్టర్ బుచ్చిబాబు నిడివి కంటే ఎక్కవే సినిమాను తీశాడంట. కానీ కొన్ని సీన్స్ వద్దనుకొని పక్కన బెట్టేశారట. వాటిని స్వయంగా బుచ్చిబాబు ఒక్కొక్కటి యూట్యూబ్ చానెళ్లో పెడుతూ హంగామా చేస్తున్నాడు.
ఉప్పెన మూవీ కోసం ఓ సరికొత్త పాటను రూపొందించారట.. గోదావరి జిల్లాలో సాధారణంగా పాడుకునే ఓ పాటను ఉప్పెన కోసం చిత్రీకరించాట. అయితే ఆ తరువాత సమయాభావం వల్ల దానిని పక్కన బెట్టేశారట. అలాగే విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల మధ్య వచ్చే ఓ సీన్ కూడా తొలగించారట. కానీ వీటిని ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టారు. ఇవి ఉంటే సినిమా మరింత రక్తికట్టేదని అంటున్నారు. వెండితెరపైన చూడకపోయినా సోషల్ మీడియాలో చూసి ఆనందిస్తున్నారు ప్రేక్షకులు.