ఇవాళ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా బన్నీకి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో అభిమానులు తమ అభిమాన హీరోకు గ్రీటింగ్స్ చెబుతుండగా.. మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విష్ చేస్తున్నారు. మరి, బన్నీకి ఎవరెవరె? ఏ విధంగా బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారో చూద్దామా!
చిరంజీవిః ‘పుష్ప’ టీజర్ చూశాను. వాస్తవానికి దగ్గరగా ఊర మాస్ గా ఉంది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ తగ్గేదే లే! నా ప్రియమైన బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
రవితేజః హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్. అదృష్టం నిన్ను వరించాలని, సంతోషం, విజయం ఎల్లప్పుడూ నీతోనే ఉండాలని కోరుకుంటున్నానను. ‘పుష్ప’ టీజర్ ఎంతో అద్భుతంగా ఉంది. సినిమా కోసం ఎదురు చూస్తున్నాను.
కాజల్ః హ్యాపీ బర్త్ డే బగ్జీ! ఈ ఏడాదంతా నీకు అత్యద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను.
శ్రీనువైట్లః సినిమా పట్ల మీకున్న అభిరుచి, నిబద్ధత ప్రేమే మిమ్మల్ని ఐకాన్ స్టార్ గా మార్చాయి. మీరు ఇలాగే ఎంతో మందిలో స్ఫూర్తి నింపాలని ఆశిస్తున్నా. పుష్ప టీజర్ ఎంతో బాగుంది. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్.
గోపీచంద్ః బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. పుష్పరాజ్ వీడియో బాగుంది. సినిమా పట్ల మీకున్న అభిరుచి, అభిమానం.. మీకు బ్లాక్ సబ్టర్ విజయాలు అందించాలని ఆశిస్తున్నా.
సునీల్ః ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సర్.. పుష్పరాజ్ టీజర్ అదిరిపోయింది. పుష్పటీమ్ లో భాగమైనందుకు సంతోషం, గర్వంగా ఉంది. ఆగస్టు 13 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా
నవదీప్ః పుష్ప ఎంతో వైల్డ్ గా ఉంది. హీరోగా మరెంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నా. హ్యాపీ బర్త్ డే బావ.