https://oktelugu.com/

బంద్.. నితిన్-రానా కొంప ముంచుతాయా?

టాలీవుడ్ లో ఈ శుక్రవారం రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘నితిన్’ రంగ్ దే, ఒకటికాగా.. రానా నటించిన పాన్ ఇండియా మూవీ ‘అరణ్య’. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాలపై ‘భారత్ బంద్’ ఎఫెక్ట్ చాలా పడింది. తెలంగాణ కంటే ఏపీలో ఈ బంద్ కు అధికార వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో అన్ని మూతపడ్డాయి.ఏపీలో బంద్ సంపూర్ణంగా సాగుతుండడంతో ఈ రెండు సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడుతోంది. బస్సులన్నీ ఏపీలో ఎక్కడికక్కడ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 26, 2021 / 10:22 AM IST
    Follow us on

    టాలీవుడ్ లో ఈ శుక్రవారం రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘నితిన్’ రంగ్ దే, ఒకటికాగా.. రానా నటించిన పాన్ ఇండియా మూవీ ‘అరణ్య’. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాలపై ‘భారత్ బంద్’ ఎఫెక్ట్ చాలా పడింది.

    తెలంగాణ కంటే ఏపీలో ఈ బంద్ కు అధికార వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో అన్ని మూతపడ్డాయి.ఏపీలో బంద్ సంపూర్ణంగా సాగుతుండడంతో ఈ రెండు సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడుతోంది.

    బస్సులన్నీ ఏపీలో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. షాపింగ్ మాల్స్, దుకాణాలు మూతపడ్డాయి. ప్రధాన నగరాల్లో వామపక్షాలు బంద్ చేపట్టాయి. ఇక విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు బృందాలుగా ఏర్పడి నగరంలో బంద్ నిర్వహిస్తున్నారు.

    ఈ ప్రభావం హీరోలు రానా, నితిన్ సినిమా ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం చూపుతోంది. ఉదయం షోకు అస్సలు జనాలు లేరని సాయంత్రం వరకు పుంజుకోవచ్చని తెలుస్తోంది.

    ఇక తెలంగాణలో బంద్ ప్రభావం పాక్షికంగానే ఉంది. హైదరాబాద్ లో సాధారణంగానే పరిస్థితులున్నాయి. దీంతో తెలంగాణలో కాస్త ఊరట చెందుతున్నారు.