https://oktelugu.com/

‘అఖండ’ కొత్త రికార్డ్.. రజిని తరువాత బాలయ్యే !

బాలయ్య అంటే కామెడీ అనుకున్నారు. స్టార్ డమ్ లేని స్టార్ హీరో అని కామెంట్స్ చేశారు. సరైన కథ పడితే.. స్టార్ హీరోలు కూడా వణికిపోయే రికార్డ్స్ ను తాను క్రియేట్ చేయగలను అని బాలయ్య మరోసారి రుజువు చేసాడు. నిజానికి రికార్డ్స్ బాలయ్యకు కొత్త కాదు, కాకపోతే గత పదేళ్లుగా బాలయ్యకు మార్కెట్ లేదు, బాలయ్యతో సినిమా చేస్తే.. ఉన్నది అమ్ముకోవడమే అంటూ కొంతమంది సినీ పెద్దలు కామెంట్స్ చేశారు. అయితే మొత్తానికి చాల సంవత్సరాల […]

Written By:
  • admin
  • , Updated On : April 21, 2021 / 01:26 PM IST
    Follow us on


    బాలయ్య అంటే కామెడీ అనుకున్నారు. స్టార్ డమ్ లేని స్టార్ హీరో అని కామెంట్స్ చేశారు. సరైన కథ పడితే.. స్టార్ హీరోలు కూడా వణికిపోయే రికార్డ్స్ ను తాను క్రియేట్ చేయగలను అని బాలయ్య మరోసారి రుజువు చేసాడు. నిజానికి రికార్డ్స్ బాలయ్యకు కొత్త కాదు, కాకపోతే గత పదేళ్లుగా బాలయ్యకు మార్కెట్ లేదు, బాలయ్యతో సినిమా చేస్తే.. ఉన్నది అమ్ముకోవడమే అంటూ కొంతమంది సినీ పెద్దలు కామెంట్స్ చేశారు. అయితే మొత్తానికి చాల సంవత్సరాల తరువాత బాలయ్య తన పంజా రుచి చూపించాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తోన్న మూడో సినిమా ‘అఖండ’ నుండి వచ్చిన చిన్నపాటి టీజర్ పెద్ద ప్రభంజనమే సృష్టిస్తోంది.

    టీజర్ రిలీజ్ అయిన నిముషం నుండే అనూహ్యంగా అదరగొట్టింది. బాలయ్య అభిమానులతో పాటు యావత్తు ప్రేషకులను ఆకట్టుకుంది. బాలయ్యకి స్టార్ డమ్ ఇంకా ఉందని నిరూపించింది. పైగా ఇప్పుడు మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుని.. తన స్టామినా రజినీకాంత్ రేంజ్ అని బాలయ్య ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా 30 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకుని మొత్తమ్మీద బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న టీజర్ గా నిలిచింది. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. దక్షిణాదిలో మన సీనియర్ స్టార్ హీరోస్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ రజినీ పేరిట ఉంది. ఆ తర్వాత 30 మిలియన్ మార్క్ రేస్ లో ఒక్క బాలయ్య సినిమా టీజర్ మాత్రమే ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

    దిల్ రాజు లాంటి నిర్మాతలు అఖండ మాస్ సెన్సేషన్ ను నమ్మలేకపోతున్నారట. అసలు బాలయ్యకి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అంటూ షాక్ అవుతున్నారట. ఎందుకంటే.. బాలయ్య సినిమా వస్తోందంటే.. చిన్నాచితకా హీరోలు కూడా పోటీగా తమ సినిమాని రిలీజ్ చేసేవాళ్ళు. కానీ, ఇప్పుడు బాలయ్య సినిమాకి పోటీగా స్టార్ హీరో సినిమా కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. రవితేజ ఖిలాడీ పోటీగా వదలాలని ఆ మధ్య ప్రయత్నాలు చేసారు. కానీ, బాలయ్య రికార్డ్స్ వేటలో ఖిలాడీ నలిగిపోతాడని.. ఇప్పడు ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు.