
తెలుగు హీరోయిన్ గా తనకు గుర్తింపు అయితే వచ్చింది గానీ, ఆ స్థాయిలో వచ్చిన స్టార్ డమ్ ను మాత్రం అంజలి నిలబెట్టుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఈ అమ్మడికి వచ్చిన సినిమా ‘వకీల్ సాబ్’. కాగా ఈ సినిమాలో అంజలి పాత్ర నలుగురిలో నారాయణ లాంటిది అయిపోయింది. ఈ క్రమంలో నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో అంజలి అందర్నీ ఆకట్టుకోవడానికి మునుపు ఎన్నడూ లేని విధంగా ఫుల్ గ్లామర్ డోస్ తో హల్ చల్ చేసింది.
అసలు ఏ ఈవెంట్ లోనైనా గ్లామర్ ఉంటేనే ఆ ఈవెంట్ సక్సెస్ అవుతుంది. అలాగే ఈవెంట్ లో పెద్ద స్టార్ హీరో ఉంటే… ఇక కెమెరా కన్ను మొత్తం ఆ హీరోగారి చుట్టే ఉంటుంది. అందుకే ఆ హీరోని మించిన స్థాయిలో తన పై కెమెరా ఫోకస్ చేయాలని.. ప్రతి హీరోయిన్ ఈవెంట్ లో హాట్ లుక్స్ లో కనిపించి కనువిందు చేస్తోంది. అంజలి కూడా నిన్న ఈవెంట్ కి చాలా అందంగా ముస్తాబై.. మొత్తానికి తన అందచందాలతో ‘హైలైట్’ అయింది.
నిజానికి ఈ సినిమాలో నివేత థామస్, అనన్య నాగళ్ళ, అంజలి, శృతి హాసన్ ఇలా నలుగురు భామలు నటించినా.. ఈవెంట్ కి మాత్రం ఇద్దరే వచ్చారు. శృతి హాసన్ ముంబైలోనే ఉండిపోవడంతో, ఇక నివేధా థామస్ కి కరోనా రావడంతో వాళ్ళు ఈవెంట్ కి రాలేకపోయారు. అందుకేనేమో ఈవెంట్ లో మిస్ అయిన గ్లామర్ షోను ప్రదర్శించే బాధ్యతని అంజలి తీసుకున్నట్లు ఉంది. ఎల్లో శారీలో కెమెరామెన్ లకు కావాల్సినంత ‘స్టఫ్’ను ఇచ్చింది ఈ ముదురు బ్యూటీ.