Homeసినిమా వార్తలుఏవరేజ్ నటికి జాతీయ అవార్డు.. వస్తోందా ?

ఏవరేజ్ నటికి జాతీయ అవార్డు.. వస్తోందా ?

Kriti Sanan
ప్రతి వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయి. అలాగే హీరోయిన్ కృతి సనన్ కి కూడా ఒక డ్రీమ్ ఉంది. ఎప్పటికైనా తానూ ఒక నటిగా జాతీయ అవార్డు పొందాలనేది ఆమె డ్రీమ్ అట. ఆమెకున్న ఏకైక అతి పెద్ద లక్ష్యం కూడా అదేనట. పైగా ప్రస్తుతం ఆమె తన లక్ష్యం దిశగానే తన ప్రయాణాన్ని సాగిస్తోందట. వినడానికి కాస్త కామెడీగా ఉన్నా.. పాపం కృతి సనన్ మాత్రం చాల సీరియస్ గా తన డ్రీమ్ గురించి చెప్పుకొస్తోంది.

ఇంతకీ ఈ డ్రీమ్ గోలను ఆమె మాటల్లోనే వింటే.. “నాకు ఒక నటిగా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అయితే అన్నిటిలో కల్లా పెద్ద డ్రీమ్ మాత్రం నేను జాతీయ అవార్డు పొందడం. ఏదో ఒకరోజు నేను జాతీయ అవార్డును అందుకోగలనని నమ్మకం కూడా నాకు ఉంది, ఆ అవార్డును సాధిస్తాను కూడా’. ఇదీ పరిస్థితి.. జాతీయ అవార్డు అట. తప్పేమి లేదు లేండి, ఉన్నతమైన లక్ష్యం ఉన్నప్పుడే కదా.. ఆ దిశగా ప్రయాణం ఉంటుంది. రీసెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జాతీయ అవార్డు డ్రీమ్ తో పాటు ఈ విషయాన్ని కూడా చెప్పింది ఈ గ్లామర్ బ్యూటీ.

నిజానికి బాలీవుడ్ లో చాల రకాలుగా ఎన్నో అవార్డులున్నాయి. అయితే, బాలీవుడ్ నటీనటులకు మాత్రం జాతీయ అవార్దు అంటే ఎనలేని గౌరవం. అందుకే ప్రతి నటి, ప్రతి నటుడు ఎప్పటికైనా జాతీయ అవార్డు అందుకోవాలని కలలు కంటారు. అందుకే, కృతి సనన్ కూడా జాతీయ అవార్డు టార్గెట్ పెట్టుకొంది. కాకపోతే కృతి సనన్ కి ఇప్పటివరకూ గ్లామర్ హీరోయిన్ అనే గుర్తింపు ఉంది తప్ప.. ఆమెకు ఇంతవరకూ సీరియస్ నటిగా మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు. నటన పరంగా ఇప్పటివరకు ఆమెకు యావరేజ్ మార్కులే దక్కాయి. మరి ఆమె నటిగా జాతీయ అవార్డును ఎలా సాధిస్తోందో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version