ఏవరేజ్ నటికి జాతీయ అవార్డు.. వస్తోందా ?

ప్రతి వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయి. అలాగే హీరోయిన్ కృతి సనన్ కి కూడా ఒక డ్రీమ్ ఉంది. ఎప్పటికైనా తానూ ఒక నటిగా జాతీయ అవార్డు పొందాలనేది ఆమె డ్రీమ్ అట. ఆమెకున్న ఏకైక అతి పెద్ద లక్ష్యం కూడా అదేనట. పైగా ప్రస్తుతం ఆమె తన లక్ష్యం దిశగానే తన ప్రయాణాన్ని సాగిస్తోందట. వినడానికి కాస్త కామెడీగా ఉన్నా.. పాపం కృతి సనన్ మాత్రం చాల సీరియస్ గా తన డ్రీమ్ గురించి చెప్పుకొస్తోంది. ఇంతకీ […]

Written By: admin, Updated On : April 11, 2021 5:46 pm
Follow us on


ప్రతి వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయి. అలాగే హీరోయిన్ కృతి సనన్ కి కూడా ఒక డ్రీమ్ ఉంది. ఎప్పటికైనా తానూ ఒక నటిగా జాతీయ అవార్డు పొందాలనేది ఆమె డ్రీమ్ అట. ఆమెకున్న ఏకైక అతి పెద్ద లక్ష్యం కూడా అదేనట. పైగా ప్రస్తుతం ఆమె తన లక్ష్యం దిశగానే తన ప్రయాణాన్ని సాగిస్తోందట. వినడానికి కాస్త కామెడీగా ఉన్నా.. పాపం కృతి సనన్ మాత్రం చాల సీరియస్ గా తన డ్రీమ్ గురించి చెప్పుకొస్తోంది.

ఇంతకీ ఈ డ్రీమ్ గోలను ఆమె మాటల్లోనే వింటే.. “నాకు ఒక నటిగా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అయితే అన్నిటిలో కల్లా పెద్ద డ్రీమ్ మాత్రం నేను జాతీయ అవార్డు పొందడం. ఏదో ఒకరోజు నేను జాతీయ అవార్డును అందుకోగలనని నమ్మకం కూడా నాకు ఉంది, ఆ అవార్డును సాధిస్తాను కూడా’. ఇదీ పరిస్థితి.. జాతీయ అవార్డు అట. తప్పేమి లేదు లేండి, ఉన్నతమైన లక్ష్యం ఉన్నప్పుడే కదా.. ఆ దిశగా ప్రయాణం ఉంటుంది. రీసెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జాతీయ అవార్డు డ్రీమ్ తో పాటు ఈ విషయాన్ని కూడా చెప్పింది ఈ గ్లామర్ బ్యూటీ.

నిజానికి బాలీవుడ్ లో చాల రకాలుగా ఎన్నో అవార్డులున్నాయి. అయితే, బాలీవుడ్ నటీనటులకు మాత్రం జాతీయ అవార్దు అంటే ఎనలేని గౌరవం. అందుకే ప్రతి నటి, ప్రతి నటుడు ఎప్పటికైనా జాతీయ అవార్డు అందుకోవాలని కలలు కంటారు. అందుకే, కృతి సనన్ కూడా జాతీయ అవార్డు టార్గెట్ పెట్టుకొంది. కాకపోతే కృతి సనన్ కి ఇప్పటివరకూ గ్లామర్ హీరోయిన్ అనే గుర్తింపు ఉంది తప్ప.. ఆమెకు ఇంతవరకూ సీరియస్ నటిగా మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు. నటన పరంగా ఇప్పటివరకు ఆమెకు యావరేజ్ మార్కులే దక్కాయి. మరి ఆమె నటిగా జాతీయ అవార్డును ఎలా సాధిస్తోందో చూడాలి.