‘పెళ్లి ఎప్పుడు’ అంటే ఫైర్ అవుతోన్న హీరోయిన్ !

అచ్చ తెలుగు బ్యూటీ అంజలికి తెలుగులో స్టార్ డమ్ రాకపోయినా మంచి గుర్తింపు అయితే వచ్చింది. నిజానికి అంజలికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో టాలీవుడ్ లో మంచి బ్రేక్ వచ్చింది. కానీ ఆ తరువాత ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా అంజలికి వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోయాయి. దీనికితోడు అమ్మడు అప్పట్లో తమిళ హీరో జై తో ఎఫైర్ నడిపి.. మొత్తానికి కెరీర్ ను పోగొట్టుకుంది. ఆ తరువాత అంజలికి […]

Written By: admin, Updated On : April 3, 2021 10:43 am
Follow us on


అచ్చ తెలుగు బ్యూటీ అంజలికి తెలుగులో స్టార్ డమ్ రాకపోయినా మంచి గుర్తింపు అయితే వచ్చింది. నిజానికి అంజలికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో టాలీవుడ్ లో మంచి బ్రేక్ వచ్చింది. కానీ ఆ తరువాత ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా అంజలికి వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోయాయి. దీనికితోడు అమ్మడు అప్పట్లో తమిళ హీరో జై తో ఎఫైర్ నడిపి.. మొత్తానికి కెరీర్ ను పోగొట్టుకుంది.

ఆ తరువాత అంజలికి వరుస పరాజయాలు క్యూ కట్టాయి. దాంతో ఉన్న గుర్తింపు కాస్త పోయింది. ఒక్క స్టార్ హీరో సినిమా కూడా అమ్మడికి ఇప్పుడు రావడం లేదు. చివరకు బాలయ్య లాంటి హీరో కూడా అంజలిని పట్టించుకోవడం లేదు. బాలయ్యకి వెంకీకి హీరోయిన్ల కొరత బాగా ఉంది. అలాంటి హీరోల సినిమాలే ఆమెకు రాకపోతే.. ఇక యంగ్ హీరోల సినిమాలు ఎలా వస్తాయి ? పైగా బాలయ్య, వెంకీలతో అంజలి గతంలో నటించింది. వారితో చక్కని అనుబంధం కూడా ఉంది ఆమెకు.

అయినా ఎందుకో వాళ్ళు అంజలిని పక్కన పెట్టారు. అందుకే నెటిజన్లు ఆమెకు ఒక ఉచిత సలహా ఇస్తున్నారు. త్వరగా పెళ్లి చేసుకోమని. కానీ అంజలి పెళ్లి పేరెత్తితేనే ఉలిక్కి పడుతుందట. అపుడెప్పుడో ఈమె పెళ్లి చేసుకుంటుందంటూ కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి. కానీ అంజలిని ‘పెళ్లి ఎప్పుడు ?’ అని అడిగితేనే మీడియా పై తెగ ఫైర్ అయిపోతుంది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి పై స్పందిస్తూ.. నా పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు ? పైగా నేను పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బాయ్ చెబుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. వాటిల్లో నిజం లేదు అని చెప్పుకొచ్చింది.