Saana Kastam Song: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య రిలీజ్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే “ఆచార్య” సినిమా రిలీజ్ కి సిద్ధం అయింది. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. అన్నీ కుదిరితే ఈ సంక్రాంతికే రిలీజ్ ఉండే అవకాశం ఉంది. తాజాగా ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటూ ఒక లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది టీమ్.

ఇక రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమోలో చిరంజీవితో పాటు రెజీనా కూడా డ్యాన్స్ తో అదరగొట్టింది. అయితే, చిరు తన వింటేజ్ గ్రేస్ స్టెప్పులతో అభిమానులను ఈ సాంగ్ తో ఫిదా చేయబోతున్నాడు. ఇక ఈ ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ.. చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోనీ.. ’ అంటూ సాగే ఈ పాట పక్కాగా మాస్ సాంగ్ అని తెలుస్తోంది.
Also Read: సాన కష్టం అంటూ మాస్ స్టెప్పులతో దుమ్మురేపనున్న ఆచార్య… సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే ?
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం కూడా ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా మంచి బజ్ ఉంది. అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.
‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన ‘లాహే లాహే’ పాట కూడా విపరీతమైన బజ్ తో పాటు ఫుల్ వ్యూస్ తో ఇప్పటికే 80 మిలియన్ల రికార్డ్ వ్యూస్ ను దక్కించుకుని మెగాస్టార్ స్టార్ డమ్ అంటే ఏంటో రుచి చూపించింది.
Also Read: ‘మా’, మోహన్ బాబు ఎఫెక్ట్: చిరంజీవి సంచలన నిర్ణయం !