https://oktelugu.com/

Kajal Agarwal: కాజల్ గురించి ఆసక్తికర న్యూస్ రివీల్ చేసిన గౌతమ్… ఎమోజితో అంతా చెప్పేశాడుగా ?

Kajal Agarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2007లో తెలుగు సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘చందమామ’తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అనంతరం వరుస విజయాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది సినిమాల్లో బిజీగా ఉన్న తల్లి కాబోతుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గర్భవతి అయిన కారణంగానే ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకుందంటూ ప్రచారం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 2, 2022 / 02:15 PM IST
    Follow us on

    Kajal Agarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2007లో తెలుగు సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘చందమామ’తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అనంతరం వరుస విజయాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది సినిమాల్లో బిజీగా ఉన్న తల్లి కాబోతుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గర్భవతి అయిన కారణంగానే ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కానీ తాజాగా న్యూ ఇయర్‌ సందర్భంగా కాజల్‌ భర్త గౌతమ్‌ చేసిన ఓ పోస్ట్‌ ఈ జంట పేరెంట్స్‌గా ప్రమోషన్‌ కొట్టనున్నారని చెప్పకనే చెప్పేసింది.

    కొత్తేడాది వేడుకల్లో భాగంగా గోవాకు హాలీడే కోసం వెళ్లారు కాజల్‌, గౌతమ్‌. ఈ సందర్భంగా దిగిన కాజల్‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన గౌతమ్‌ దానికి ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు. కాజల్‌ ఫోటోతో పాటు.. ‘2022.. నిన్ను చూస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో పాటు పక్కన ప్రెగ్నెంట్‌ లేడీ ఎమోజీని సైతం జోడించాడు.

    దీంతో ఇది గమనించిన నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ను 2020 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకుంది కాజల్. ప్రస్తుతం కాజల్‌ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక భారతీయుడు 2, ఘోస్ట్ సీనిమాల నుంచి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.