గతం జ్ఞాపకంగా మిలిగిపోతేనే భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే, గడిచిపోయిన దానిబట్టే జరగబోయేది ఊహించుకుంటం కాబట్టి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఎప్పుడూ గతం తాలూకు ట్రాక్ రికార్డ్స్ చూసిన తరువాతే, విలువ ఇస్తారు. అయితే, మన స్టార్ హీరోల జీవితాల్లో కూడా ఓ సంవత్సరం మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఆ ఏడాదిని రికార్డుల సంవత్సరంగా కూడా నామకరణం చేయవచ్చు.
అంతగా ఆ ఏడాదిలో కొన్ని సినిమాలు ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగ రాశాయి. ఆ ఏడాదే 2001. ముందుగా బాలయ్య బాబు హీరోగా శ్రీవెంకటరమణ ప్రొడక్షన్స్ పై వచ్చిన ‘నరసింహనాయుడు’ సంచలన సూపర్ హిట్ గా నిలిచి, బాలయ్య కెరీర్ లోనే అఖండ విజయం సాధించింది. పైగా కలెక్షన్లలోనూ, అలాగే అటు రన్ లోనూ ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించి బాలయ్యకు బాక్సాఫీస్ బొనంజా అనే బిరుదును తెచ్చి పెట్టింది.
అలాగే 2001వ సంవత్సరమే పవన్ కళ్యాణ్ అనే హీరోని పవర్ స్టార్ ను చేసింది. అప్పటివరకూ చిరంజీవి తమ్ముడు అని పిలిచే వాళ్ళు కూడా పవర్ స్టార్ తరువాతే మెగాస్టార్ కూడా, అనే స్థాయిని పవన్ కి ఇచ్చింది ‘ఖుషి’ సినిమా. 2001లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘ఖుషి’ సూపర్ హిట్ గా నిలచి, రజతోత్సవం జరుపుకోవడం పాటు అప్పటి రికార్డ్స్ ను వణికించింది. పవన్ కి మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.
మహేష్ బాబు అని సూపర్ స్టార్ కృష్ణ చిన్న కొడుకు అట. హీరోగా ఏదో ఒక సినిమా చేస్తున్నట్టు ఉన్నాడు, ఇలా ఉండేది మహేష్ బాబు పరిస్థితి 2001కి ముందు. కానీ ఆ ఏడాది మహేష్ కి కూడా గొప్ప గుర్తింపు తెచ్చింది. ఒక విధంగా మహేష్ ను సూపర్ స్టార్ ను చేసింది కూడా ఆ ఏడాదే. మహేష్ లో స్టార్ ఉన్నాడు అని నిరూపించిన మొట్టమొదటి సినిమా ‘మురారి’. ఆ సినిమా కూడా 2001లోనే రిలీజ్ అయి గొప్ప విజయాన్ని అధిరోహించింది.
ఎన్టీఆర్ గారి మనవడు అట, పేరు జూనియర్ ఎన్టీఆర్. ఆ మధ్య ‘నిన్ను చూడాలని’ అనే సినిమాలో హీరోగా పరిచయమైయ్యాడు. కానీ జూనియర్ యన్టీఆర్ కి హీరో అనే స్టేటస్ రాలేదు. కానీ 2001వ సంవత్సరమే జూనియర్ ఎన్టీఆర్ హీరో కాదు, స్టార్ లకే స్టార్ అని ఘనంగా చాటి చెప్పింది. ఎందుకంటే ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నంబర్ వన్’ ద్విశతదినోత్సవం ఆ ఏడాదే అట్టహాసంగా జరిగింది.
ఇక విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే తొలిసారి ఓ ప్రయాత్మక చిత్రంలో నటించిన సంవత్సరం కూడా 2001నే. ఆ ఏడాది వెంకీ నుండి వచ్చిన ‘దేవీపుత్రుడు’ కూడా శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా అప్పట్లో ఒక వినూత్న చిత్రంగా వచ్చి ఇప్పటికే వైవిధ్యంగానే ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవికి కూడా 2001 స్పెషలే. చిరు నటించిన ‘మృగరాజు’ సినిమా కూడా శతదినోత్సవం జరుపుకుంది.
అలాగే మిగిలిన హీరోల కెరీర్ లో కూడా ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. సినీ చరిత్రలో ఈ ఏడాదిలోనే తక్కువ ప్లాప్ లు వచ్చాయి. ఇక ఈ ఏడాదిలో హిట్ అయిన మిగిలిన సినిమాల లిస్ట్ పరిశీలిస్తే.. “ప్రియమైన నీకు, ప్రేమించు, సింహరాశి, డాడీ, హనుమాన్ జంక్షన్” లాంటి కొన్ని చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి, మంచి కలెక్షన్స్ సాధించాయి.
అదే విధంగా “6 టీన్స్, దీవించండి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, భద్రాచలం, సుబ్బు” లాంటి మరికొన్ని చిత్రాలు సక్సెస్ ఫుల్ గా సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఏది ఏమైనా గతంలోని సంఘటనలలోకి వెళ్ళిపోయినప్పుడు గుండె ఝల్లుమంటుంది అన్నట్టు.. గడిచిపోయిన మధురమైన ఆ ఏడాది ఎప్పటికీ కరిగిపోని కలలానే సినీ చరిత్రలో శాశ్వతంగా లిఖించబడుతుంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: 2001 movies review sweet memory to the stars
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com