RRR డైరీలో పెరిగిన 15 పేజీలు..!

RRR డైరీలో మొద‌టి పేజీ రాయ‌డం మొద‌లై రెండేళ్లు దాటింది. కానీ.. ఇంకా చివ‌రి పేజీ రావ‌ట్లేదు. హ‌మ్మ‌య్య‌.. ఇక ద‌గ్గ‌ర ప‌డింది అనుకునేలోపు, మ‌రికొన్ని పేజీలు యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్త‌గా మ‌రో 15 పేజీలు వ‌చ్చిచేరాయ‌ట‌. దీంతో.. మ‌ళ్లీ కొత్త పేజీలా? అని అటు రామ్ చ‌ర‌ణ్, ఇటు ఎన్టీఆర్ దిగాలు ప‌డుతున్నార‌ట‌! వాస్త‌వానికి మే నెల‌తో షూటింగ్ మొత్తం ఫినిష్ అయిపోతుంద‌ని భావించారు. గుమ్మ‌డికాయ కొట్టేసి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేసుకోవ‌డ‌మే […]

Written By: Bhaskar, Updated On : March 30, 2021 11:31 am
Follow us on


RRR డైరీలో మొద‌టి పేజీ రాయ‌డం మొద‌లై రెండేళ్లు దాటింది. కానీ.. ఇంకా చివ‌రి పేజీ రావ‌ట్లేదు. హ‌మ్మ‌య్య‌.. ఇక ద‌గ్గ‌ర ప‌డింది అనుకునేలోపు, మ‌రికొన్ని పేజీలు యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్త‌గా మ‌రో 15 పేజీలు వ‌చ్చిచేరాయ‌ట‌. దీంతో.. మ‌ళ్లీ కొత్త పేజీలా? అని అటు రామ్ చ‌ర‌ణ్, ఇటు ఎన్టీఆర్ దిగాలు ప‌డుతున్నార‌ట‌!

వాస్త‌వానికి మే నెల‌తో షూటింగ్ మొత్తం ఫినిష్ అయిపోతుంద‌ని భావించారు. గుమ్మ‌డికాయ కొట్టేసి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేసుకోవ‌డ‌మే అనుకున్నారు. ఆల్మోస్ట్ క‌న్ఫాం కావ‌డంతో.. ఎవ‌రి షెడ్యూల్ వారు ప్రిపేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కోసం డేట్లు కేటాయించగా.. చరణ్ ఇతర పనులు పెట్టుకున్నాడు.

అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. జూన్ లోనూ షూటింగ్ కొనసాగనుందట. పదిహేను రోజులపాటు షూటింగ్ పొడిగించాడట జక్కన్న. దీంతో.. వీరి ప్లానింగ్ మొత్తం డిస్ట్రబ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించడంతో.. అక్టోబరులోనే సినిమా రిలీజ్ చేయాలని చూస్తోందట యూనిట్.

కాస్త లేట్ అయినా.. అదే నెలలో రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటు షూటింగ్ చూస్తుంటేనేమో కొండలా పెరిగిపోతూనే ఉంది. మరోవైపు వీఎఫ్ఎక్స్ వర్క్ మామూలుగా ఉండ‌దు. ఇంకో వైపు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మ‌రి, ఇలాంటి ప‌రిస్థితుల్లో జూన్ తో ఆగుతుందా? ఇంకా ముందుకు సాగుతుందా అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్