https://oktelugu.com/

తన కాళ్లు పట్టుకున్నవారెవరో తెలిపిన నిహారిక !

మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిహారిక, చైతన్యల వివాహం పరిమిత అతిథుల మధ్య ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో ఓ ఫొటోని షేర్‌ చేసింది. నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆమెను ఇద్దరు లేడీస్‌ రెడీ చేస్తున్నారు. ఇందులో నిహారిక కాళ్ల ముందు […]

Written By:
  • admin
  • , Updated On : December 5, 2020 / 10:46 AM IST
    Follow us on


    మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిహారిక, చైతన్యల వివాహం పరిమిత అతిథుల మధ్య ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో ఓ ఫొటోని షేర్‌ చేసింది. నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆమెను ఇద్దరు లేడీస్‌ రెడీ చేస్తున్నారు. ఇందులో నిహారిక కాళ్ల ముందు ఇద్దరు యువతులు కనిపిస్తున్నారు.

    Also Read: మెగాస్టార్ కోసం ప్రత్యేక సెట్.. సాంగ్స్ ను కూడా.. !

    కాగా వారిద్దరూ ఎవరన్న చర్చ నెట్టింట జరుగుతున్న వేళ, స్వయంగా నిహారికే వారెవరన్న విషయాన్ని బహిర్గతం చేస్తూ.. తాను పోస్ట్ చేసిన పిక్ లో ఉన్న వారు తన హీల్స్ ను సరిచేస్తున్నారని చెప్పుకొచ్చింది. వారిద్దరూ పెళ్లికూతురుని ఎంతో బాగా సిద్ధం చేస్తారని తెలిపిన నిహారిక, అందుకే వారితో తనకు పరిచయం ఏర్పడిందని చెబుతూ, లవ్ యూ గర్ల్స్ అంటూ వారితో కలిసి తీయించుకున్న పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పిక్ కూడా వైరల్ అవుతోంది. ఈ నెల 9న నిహారిక పెళ్లి జరగనుంది.

    https://www.instagram.com/p/CIXaDhHJiiu/

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్