https://oktelugu.com/

హీరో అజిత్ కు తీవ్ర గాయాలు: ‘వలిమై’ షూటింగ్ లో ప్రమాదం

తమిళ హీరో అజిత్ కు గాయాలయ్యాయి. ‘వలిమై’ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో బైక్ తో రిస్కీ షాట్ చేశాడు. ఇందులో భాగంగా ఆయన చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన సహచరులు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తీస్తున్న ‘వలిమై’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం గురువారం డూబ్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశాడని సమాచారం. అజిత్ బైక్ నడపడంలో ఆరితేరిన వ్యక్తి. దీంతో ఆయన […]

Written By: , Updated On : November 19, 2020 / 06:30 PM IST
Follow us on

తమిళ హీరో అజిత్ కు గాయాలయ్యాయి. ‘వలిమై’ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో బైక్ తో రిస్కీ షాట్ చేశాడు. ఇందులో భాగంగా ఆయన చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన సహచరులు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తీస్తున్న ‘వలిమై’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం గురువారం డూబ్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశాడని సమాచారం. అజిత్ బైక్ నడపడంలో ఆరితేరిన వ్యక్తి. దీంతో ఆయన రిస్కీ షాట్ కు ఒప్పుకున్నాడు. ప్రస్తతం ఆయనకు ప్రమాదమేమీ లేకపోయినా కొన్ని రోజుల పాటు షూటింగ్ కు రాకపోవచ్చు. ఇందులో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.