క్రిస్మస్‌ ఆ దేశాల వారికి ప్రత్యేకం

క్రిస్మస్‌ పండుగను ప్రపంచ దేశాలు ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉంటాయి. అయితే.. ఈ సెలబ్రేషన్స్‌ల్లోనూ ఒక్కో దేశం ఒక్కో ప్రత్యేకతను చాటుతోంది. డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినం. క్రీస్తు జన్మదినం పురస్కరించుకుని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇళ్లను డెకొరేట్ చేసుకోవడం నుంచి క్రిస్మస్ చెట్టు, స్టార్ ఇతరత్రా హంగామా చేసేస్తున్నారు. ఎక్కడ చూసిన చర్చీలను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. రాత్రి వేళల్లో క్రిస్మస్ క్యారోల్స్‌ అత్యంత వైభవంగా […]

Written By: Srinivas, Updated On : December 22, 2020 11:21 am
Follow us on


క్రిస్మస్‌ పండుగను ప్రపంచ దేశాలు ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉంటాయి. అయితే.. ఈ సెలబ్రేషన్స్‌ల్లోనూ ఒక్కో దేశం ఒక్కో ప్రత్యేకతను చాటుతోంది. డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినం. క్రీస్తు జన్మదినం పురస్కరించుకుని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇళ్లను డెకొరేట్ చేసుకోవడం నుంచి క్రిస్మస్ చెట్టు, స్టార్ ఇతరత్రా హంగామా చేసేస్తున్నారు. ఎక్కడ చూసిన చర్చీలను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. రాత్రి వేళల్లో క్రిస్మస్ క్యారోల్స్‌ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.

Also Read: క్రిస్మస్ స్టార్ ప్రత్యేకత ఏంటీ..?

– ముఖ్యంగా జపాన్‌లో క్రిస్మస్ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇతర క్రిస్టియన్ మెజార్టీ దేశాలకంటే జపాన్‌లో క్రిస్మస్‌ను మరింత లౌకిక పద్ధతిలో జరుపుకుంటారు. క్రిస్మస్ అనేది దంపతులు లేదా లవ్ కపుల్ మరింత రొమాంటిక్‌గా జరుపుకుంటారు. ఇక పండగ రోజున జపాన్‌ కుటుంబాలు కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) తినేందుకు చాలా ఇష్టపడతారు.కేఎఫ్‌సీ చికెన్‌ను ఒక సంప్రదాయ వంటకంగా భావిస్తారు.

– పోలాండ్‌లో మరింత జాలీగా జరుపుకుంటారు. కానుకలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు చర్చి సర్వీసులు ఉంటాయి. ఇక హోం అలోన్ చిత్రాన్ని కచ్చితంగా చూస్తారు. కార్ప్ అనే చేపను వారంతా కోసుకుని వండుకుని తింటారు. క్రిస్మస్ కంటే కొన్ని రోజుల ముందే ఈ చేపను ఇంటి యజమానురాలు కొని నీళ్లు ఉన్న టబ్‌లో వేస్తుంది. క్రిస్మస్ రోజున ఈ చేపను కోసి కూర చేసుకుంటారు.

– ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వెరైటీగా జరుపుకుంటారు. ఆస్ట్రేలియన్లు క్రిస్మస్‌ను బీచ్ వద్ద జరుపుకుంటారు. మధ్యాహ్నం బార్బీక్యూ వంటకాలు చేసుకుని అక్కడే భోజనం చేస్తారు. ఇక బీచ్‌పై క్రికెట్ ఆడతారు. అనంతరం సముద్రంలో స్నానం చేసి ఇక భోజనం చేస్తారు. బీచ్ మీద ఉన్న మట్టి మొత్తం తెలుపు రంగులో ఉండటం వల్ల ఇక్కడ జరిగే వేడుకను వైట్ క్రిస్మస్ అని కూడా పిలుస్తారు.

Also Read: క్రిస్టియన్లకు ‘కరోనా’.. కొత్త అనుభవాన్ని పంచబోతుందా..!

– ఉక్రెయిన్‌లో క్రిస్మస్‌ను డిసెంబర్ 25వ తేదీ కాకుండా జనవరి 7వ తేదీన జరుపుకుంటారు. వారు జూలియన్ క్యాలెండర్‌ను ఫాలో అవుతారు. ఇక ఆకాశంలో తొలి నక్షత్రాన్ని చూసేవరకు వారు క్రిస్మస్ డిన్నర్ చేయరు.

– జమైకాలో క్రిస్మస్ వేడుకలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ వేడుకలు నాన్‌స్టాప్‌గా ఉంటాయి. షాపింగ్ దగ్గర నుంచి పండగ వరకు అన్నీ ప్రత్యేకమే. చాలా నగరాల్లో గ్రాండ్ మార్కెట్లు దర్శనమిస్తాయి. ఇక ఎటు చూసినా ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను, ఫుడ్ ఐటెమ్స్‌ను అమ్ముతారు. ఓ వైపు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ మరోవైపు ప్రత్యేకంగా అల్లంతో తయారు చేసిన తియ్యటి జ్యూస్‌ను తాగుతూ సరదాగా గడుపుతారు. అంతేకాదు ఫ్రూట్ కేక్ క్రిస్మస్ రోజున చాలా ప్రత్యేకం. ఈ ఫ్రూట్‌ కేక్‌ను రమ్‌లో ముంచి ఆరగిస్తారు.