టీడీపీ రెచ్చగొట్టే రాజకీయాలు.. ఉచ్చులో పడని వైసీపీ

ఏపీలో రెచ్చగొట్టే రాజకీయాలకు దిగుతోంది ప్రధాన ప్రతిపక్ష టీడీపీ. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిని ప్రకటించాలంటూ డిమాండ్‌ చేస్తూ కొత్త రాజకీయాలకు దిగింది. వైసీపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటిస్తే.. దాన్ని సాకుగా చూపి స్థానిక ఎన్నికల ప్రస్తావన తేవాలని భావిస్తోంది. వైసీపీ మాత్రం టీడీపీ ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. Also Read: న్యాయవ్యవస్థను కాపాడుతా.. జగన్ సర్కార్ పై జస్టిస్ రాకేష్ కుమార్ హాట్ కామెంట్స్ ఇప్పుడు స్థానిక టీడీపీ […]

Written By: Srinivas, Updated On : December 22, 2020 11:38 am
Follow us on


ఏపీలో రెచ్చగొట్టే రాజకీయాలకు దిగుతోంది ప్రధాన ప్రతిపక్ష టీడీపీ. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిని ప్రకటించాలంటూ డిమాండ్‌ చేస్తూ కొత్త రాజకీయాలకు దిగింది. వైసీపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటిస్తే.. దాన్ని సాకుగా చూపి స్థానిక ఎన్నికల ప్రస్తావన తేవాలని భావిస్తోంది. వైసీపీ మాత్రం టీడీపీ ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Also Read: న్యాయవ్యవస్థను కాపాడుతా.. జగన్ సర్కార్ పై జస్టిస్ రాకేష్ కుమార్ హాట్ కామెంట్స్

ఇప్పుడు స్థానిక టీడీపీ నాయకులు కూడా ముందు వైసీపీ అభ్యర్థి ఎవరో తేల్చాలని పట్టుబడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం వెనుక కూడా ఇదే రాజకీయ కారణం ఉందని అంటున్నారు విశ్లేషకులు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కరోనాని సాకుగా చూపుతూ వాయిదా కోరింది వైసీపీ ప్రభుత్వం. తిరుపతి ఉప ఎన్నికను సాకుగా చూపిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలకు లింక్ పెట్టాలని చూస్తోంది టీడీపీ. అందుకే.. టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా వైసీపీ అడుగులు వేస్తోంది. తిరుపతిలో దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి టికెట్ ఇవ్వట్లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. అసలు అభ్యర్థి ఎవరనే విషయంపై లీకులిచ్చి ఊరుకుంది.

ఇప్పటివరకు ఎక్కడా కూడా వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు ఎలాంటి కామెంట్లు కూడా రాలేదు. తిరుపతి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన సందర్భంగా.. అభ్యర్థి ఎవరైనా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెబుతున్నారే కానీ, పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. సీఎం జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటం వల్లే నేతలంతా ఒకే మాటపై ఉన్నారని తెలుస్తోంది.

Also Read: వైసీపీపై పోలీసుల స్వామి భక్తి సల్లగుండా?

వైసీపీ నేతలు క్యాండిడేట్‌ ఎవరో తెలియకుండా ప్రచారం సాగిస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం వైసీపీ నేతలను రెచ్చగొడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు రెడీ అవుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి వస్తున్న అడ్డంకి ఏంటని నిలదీసేందుకు రెడీ అయిపోయారు. మరోవైపు ఎన్నికల కమిషనర్ విశ్వ ప్రయత్నాలు కూడా ఫలించేలా లేవు. జనవరిలో టీకా పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రాష్ట్రాలకు ఈ మేరకు అధికారిక సమాచారం రావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా మారుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్