Zelio-E Mobility : ఇటీవల కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు జైలియో-ఈ మొబిలిటీ సంస్థ తమ ఈవా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫామెన్స్ మరింత మెరుగైంది. పట్టణ ప్రాంతాల్లో ఉపయోగించుకునే విధంగా దీనిని మూడు మోడళ్లలో లాంచ్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే.. కొత్త ఈవా 2025 మోడల్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు దూరం ప్రయాణించగలదు. ఈ వేగంతో స్కూటర్‌ను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే ఆర్టీవో రిజిస్ట్రేషన్ కూడా చేయించాల్సిన అవసరం లేదు.
Also Read: పునర్జన్మ నేపథ్యం లో ‘హరి హర వీరమల్లు’..పూర్తి స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
ఈవా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 150 మి.మీ.ల మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. దీంతో గుంతలు, ఎత్తుపల్లాల రోడ్లపై కూడా సునాయాసంగా నడపవచ్చు. ఈ స్కూటర్‌లో 60/72V BLDC పవర్‌ఫుల్ మోటార్ అమర్చారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 1.5 యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతుంది. స్కూటర్ బరువు 85 కిలోగ్రాములు కాగా, ఇది 150 కిలోగ్రాముల వరకు బరువును మోయగలదు. అంటే ఇద్దరు వ్యక్తులు సులువుగా ప్రయాణించవచ్చు.
కంపెనీ ఈ స్కూటర్‌ను లిథియం-అయాన్, జెల్ బ్యాటరీ వెర్షన్లలో అందిస్తోంది. లిథియం-అయాన్ వేరియంట్ల విషయానికి వస్తే 60V/30AH మోడల్ ధర రూ.64,000, ఇది 90-100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 74V/32AH వెర్షన్ ధర రూ.69,000, ఇది 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. జెల్ బ్యాటరీ వేరియంట్ల విషయానికి వస్తే 60V/32AH మోడల్ ధర రూ.50,000, ఇది 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 72V/42AH వెర్షన్ ధర రూ.54,000, ఇది 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
Also Read: మహేష్, రాజమౌళి మూవీ నుండి నాగార్జున తప్పుకోడానికి కారణాలు ఇవేనా..? మంచి ఛాన్స్ మిస్ అయ్యాడుగా!
బ్యాటరీ రకాన్ని బట్టి స్కూటర్ ఛార్జింగ్ సమయం మారుతుంది. లిథియం-అయాన్ బ్యాటరీకి పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి దాదాపు నాలుగు గంటలు పడుతుంది. అదే జెల్ బ్యాటరీ అయితే పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 8 నుండి 10 గంటల సమయం పడుతుంది. స్కూటర్‌లో ముందు వెనుక రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. 12 అంగుళాల టైర్లు, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ అమర్చారు. ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, డే-టైమ్ రన్నింగ్ లైట్స్, కీ-లెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారం, పార్కింగ్ గేర్, USB ఛార్జింగ్ పోర్ట్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ స్కూటర్ గతంలో మాదిరిగానే బ్లూ, గ్రే, వైట్, బ్లాక్ రంగులలో లభిస్తుంది.
కంపెనీ ఈ స్కూటర్‌పై రెండేళ్ల వారంటీని అందిస్తోంది. అన్ని బ్యాటరీ వేరియంట్స్‌పై ఒక సంవత్సరం వారంటీ లభిస్తుంది. జైలియో ఈ మొబిలిటీ కంపెనీ 2021లో ప్రారంభమైంది. ఇప్పటివరకు దీనికి 2 లక్షల కంటే ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనికి 400 డీలర్ స్టోర్లు ఉన్నాయి. కంపెనీ 2025 చివరి నాటికి డీలర్‌షిప్‌ల సంఖ్యను 1,000 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.