Rajamouli Mahesh Movie : అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం తో ఇక నుండి కేవలం హీరో రోల్స్ మాత్రమే కాదు మంచి క్యారక్టర్ రోల్స్ కూడా చేస్తానని అధికారిక ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఆయన ‘కూలీ'(Coolie Movie) చిత్రం లో మెయిన్ విలన్ క్యారక్టర్ చేయడానికి కూడా సిద్దమయ్యాడు. నేటి తరం లో సూపర్ స్టార్స్ గా పిలవబడే డైరెక్టర్స్ అందరితో కలిసి పని చెయ్యాలని నాగార్జున కి ఉందట. అలా నాగార్జున లిస్ట్ లో ఉన్న డైరెక్టర్ రాజమౌళి. మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో సినిమా ఖరారు అయినప్పుడే ఇందులో నాగార్జున కి ఒక కీలక పాత్ర ఓకే అయ్యింది. అది మహేష్ బాబు కి తండ్రి గా నటించే పాత్ర అన్నమాట. ఈ క్యారక్టర్ గురించి నాగార్జున ఒకసారి ట్విట్టర్ లో మహేష్ బాబు తో సరదా చిట్ చాట్ కూడా చేశాడు.
అప్పట్లో ఆయన మాట్లాడుతూ ‘హై మహేష్..నేను, మీ నాన్న గారు కలిసి వారసుడు అనే చిత్రం అప్పట్లో చేసాము. ఇప్పుడు మనిద్దరం కలిసి అలాంటి సినిమా త్వరలోనే చేయబోతున్నాం కదా’ అని అన్నాడు. అప్పుడే అందరికీ అర్థమైపోయింది, #SSRMB లో నాగార్జున మహేష్ కి తండ్రి క్యారక్టర్ చేస్తున్నాడని. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, చివరి నిమిషం లో నాగార్జున ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఈ క్యారక్టర్ ఆయనకు సరిపడదు అనుకున్నాడో, లేకపోతే రాజమౌళి తన విజన్ కి తగ్గట్టు నాగార్జున క్యారక్టర్ లేదని ఆయన్ని తప్పించాడో ఏమో తెలియదు కానీ, నాగార్జున అయితే ఈ సినిమా లో నటించడం లేదు అనేది ఖరారు అయ్యింది. ఇప్పుడు మహేష్ బాబు తండ్రి క్యారక్టర్ కోసం తమిళ హీరో మాధవన్ ని డైరెక్టర్ రాజమౌళి సంప్రదించినట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి గానే ఉన్నాడట.
మాధవన్ కంటే ముందు మహేష్ తండ్రి పాత్ర కోసం తమిళ హీరో చియాన్ విక్రమ్ ని సంప్రదించాడట రాజమౌళి. కానీ ఆయన ఎందుకో ఈ క్యారక్టర్ చేయడానికి ఇష్టపడలేదు. తన స్థాయి కి తగ్గ క్యారక్టర్ కాదని రిజెక్ట్ చేశాడట. దీంతో ఆ స్థానంలోకి మాధవన్ వచ్చాడు. ఒకవేళ ఈ చిత్రంలో నాగార్జున ఉండుంటే సినిమాకు మంచి బలం చేకూరేది, అక్కినేని ఫ్యాన్స్ కూడా గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇకపోతే రీసెంట్ గానే మొదలై రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్, ఇప్పుడు మూడవ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతుంది. అందుకోసం రామోజీ ఫిలిం సిటీ లో వారణాసి సెట్స్ ని కూడా ఏర్పాటు చేశారట. అంతే కాదు ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుండి ఒక చిన్న గ్లింప్స్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నారట.