TATA NANO 2026: లక్ష రూపాయలకే కారు అందించిన Tata కంపెనీని ఎవరూ మర్చిపోరు. అయితే ఈ కారు అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో కొద్ది కాలంలోనే ఉత్పత్తి ఆగిపోయిన ఇది ఇప్పుడు మళ్లీ కొత్త తరహాలో రాబోతోంది. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫీచర్లు, సౌకర్యాలతో పాటు మైలేజ్ ఎక్కువ ఇచ్చేయి కారును తక్కువ ధరకే సామాన్యులకు అందించేందుకు కంపెనీ యాజమాన్యం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించగా.. దీని గురించి తీవ్రమైన చర్చ సాగుతోంది. అయితే లేటెస్ట్గా ఈ కారు ధరపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అలాగే ఇందులో ఉండే ఫీచర్ల గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. వీరి కోసం ఈ వివరాలు..
Tata కంపెనీకి చెందిన Nano ఇప్పుడు కొత్త తరహాలో రాబోతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది. అయితే 2026 సంవత్సరంలో ఎప్పుడైనా ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది. ఈ కారులో ప్రధానంగా డిజైన్ గురించి చెప్పుకోవచ్చు. గతంలో వచ్చి నాన్న కంటే ఇప్పుడు పూర్తిగా బాహ్య డిజన్ మారిపోయింది. కొత్త కారు ఎల్ఇడి లాంప్ లు, DRL లు అమర్చారు. స్టైలిష్ బాడీ తో పాటు సీటింగ్ కు సరైన పరిమాణాన్ని అమర్చారు. కొత్త ఫ్రంట్ గ్రిల్, ఆధునికరించబడిన బంపర్ చూడవచ్చు. లేటెస్ట్ గా వచ్చే ఈ కారులో ఇంజన్ పనితీరు కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేసే అవకాశం ఉంది. ఇది మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. దీంతో రోజువారి ప్రయాణికులకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజన్ పై లీటర్ ఇంధనానికి 25 కిలోమీటర్ల మైలేజ్ వరకు వెళ్లే అవకాశం ఉంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణం చేయాలని అనుకునే వారికి ఈ కారు ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా బడ్జెట్లో కారు కొనాలని అనుకునే వారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.
నేటి తరం వారికి అనుగుణంగా ఈ కారులో ఫీచర్లను సెట్ చేశారు. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంటర్ క క్లస్టర్ ఉన్నాయి. చిన్న ఫ్యామిలీ సుదూర ప్రయాణం చేసిnaa ఎలాంటి అలసట రాకుండా ఉంటుంది. ఇది కాంపాక్ట్ కారు అయినప్పటికీ మెరుగైన సేఫ్టీ ఫీచర్లను చేర్చారు. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD టెక్నాలజీని చేర్చారు. బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సార్ కూడా ఉన్నాయి.
బడ్జెట్లో కారు కొనాలని అనుకునే వారికి ఇది అందుబాటులో ఉంది. ఎందుకంటే దీనిని రూ.3.5 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. తక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండడంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉంది.