Yezdi Adventure: చాలా మందికి బైకులతో కొండలు గుట్టలు ఎక్కుతూ అడ్వెంచర్స్ చేయాలని ఉంటుంది. అలాంటి వారి కోసం వచ్చే నెలలో భారతీయ మార్కెట్‌లోకి ఒక అదిరిపోయే బైక్ ఎంట్రీ ఇవ్వబోతుంది. కాకపోతే ఇది ఇప్పటికే ఉన్న మోడల్‌కు అప్‌డేట్ వెర్షన్. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఇండియాలో ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.. ఎందుకో తెలుసా?
మహీంద్రా గ్రూప్ సపోర్ట్‌తో నడుస్తున్న క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ మే 15వ తేదీన ఓ ప్రత్యేక ప్రకటన చేయనుంది. ఆ రోజున ఒక ‘వైల్డ్’, ‘అడ్వెంచరస్’ బైక్‌ను విడుదల చేయబోతున్నట్లు టీజ్ చేసింది. దీంతో యోడ్జి అడ్వెంచర్(Yezdi Adventure) అప్‌డేట్ వెర్షన్ విడుదలయ్యే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. క్లాసిక్ లెజెండ్స్ యెడ్జితో పాటు BSA, Jawa బ్రాండ్‌లను కూడా కలిగి ఉంది.
అప్‌డేటెడ్ Yezdi Adventure ఎలా ఉండబోతోంది?
మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే నెలలో యెడ్జి అడ్వెంచర్ అప్ డేటెడ్ వెర్షన్ విడుదల చేయవచ్చు. ఈ బైక్ చివరిసారిగా ఆగస్టు 2024లో అప్‌డేట్ అయింది. ఇప్పుడు వస్తున్న కొత్త అప్‌డేట్‌లో డిజైన్‌తో పాటు ఫీచర్లలో కూడా మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం యెడ్జి అడ్వెంచర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411ను చాలా పోలి ఉంది. కాబట్టి, కంపెనీ దీని డిజైన్‌లో గణనీయమైన మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే, ఇంజన్, ఛాసిస్‌ను మాత్రం పాత విధంగానే ఉంచవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ బైక్‌లో 334సీసీ ఇంజన్ ఉంది. ఇది 29.68 bhp పవర్, 29.84 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్, USB ఛార్జర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ABS, ఆఫ్-రోడ్ బైకింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని వెనుక టైర్‌కు ABSను పూర్తిగా డిస్‌కనెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో రూ.2.10 లక్షల నుంచి రూ.2.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
మార్కెట్‌లో ఈ బైక్ యూత్ ఫేవరెట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌తో పోటీపడుతుంది. అలాగే KTM 250 Adventure, Hero Xpulse 210 వంటి బైక్‌లు కూడా దీనికి ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. మరి ఈ అప్‌డేటెడ్ వెర్షన్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించడం ఖాయం అంటున్నారు.
Also Read: చూస్తే వెంటనే కొనాలనిపించే ఈ కారు గురించి తెలుసా?