spot_img
Homeబిజినెస్Yamaha Hybrid Bike: Yamaha హైబ్రిడ్ ఇంజన్ బైక్ రాబోతుంది.. ఫీచర్స్ ను చూస్తే...

Yamaha Hybrid Bike: Yamaha హైబ్రిడ్ ఇంజన్ బైక్ రాబోతుంది.. ఫీచర్స్ ను చూస్తే యూత్ ఫిదా అవుతారు..

Yamaha Hybrid Bike: కాలం మారుతున్న కొద్దీ బైక్ లలో అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం పెట్రోల్ తో నడిచే టూ వీలర్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు అడ్వాన్స్గా ఆలోచించి హైబ్రిడ్ వెహికల్స్ ను తీసుకొస్తున్నాయి. హైబ్రిడ్ వెహికల్స్ అంటే రెండు ఇంజన్లు ఉండడం. ఒకటి పెట్రోల్ ఇంజన్ తో పాటు మరొకటి ఎలక్ట్రిక్ వేరియంట్ తో కలిసి పనిచేయడం. ఇలా హైబ్రిడ్ ఇంజన్ కలిగిన బైక్ ఒకటి మార్కెట్లోకి రాబోతుంది. యమహా కంపెనీకి చెందిన ఈ బైక్ డిజైన్ తో పాటు హైబ్రిడ్ ఇంజన్ ఉండడం వల్ల యూత్ బాగా ఆదరిస్తారని కంపెనీ నమ్ముతోంది. ఇంతకీ ఇది ఏ బైక్? ఇందులో ఉండే విశేషాలేంటి?

Yamaha కంపెనీ నుంచి MT -09 PHEV అనే బైక్ రెడీ అవుతోంది. ఈ బైక్ చూడడానికి ఆకర్షణీయంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఇంజన్ ప్రదేశంలో కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో రెండు రకాల ఇంజన్లు ఉంటాయి. ఒకటి 890 సిసి సామర్థ్యం కలిగిన పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది మూడు సిలిండర్లతో కలిసి పని చేస్తుంది. 50 కిలోమీటర్ల వేగం దాటిన తర్వాత మరో ఇంజన్ ఎలక్ట్రిక్ వేరియంట్ ఆటోమేటిక్ గా యాక్టివ్ అవుతుంది. సైలెంట్ మోడ్ లో వెళ్లే ఈ బైక్ నుంచి బయటకు వచ్చే కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువ. అంతేకాకుండా ఈ బ్యాటరీ చార్జ్ చేయడానికి వెనుక భాగంలో ప్రత్యేకంగా పోర్ట్ ను ఏర్పాటు చేశారు. దీంతో దీనిని చార్జింగ్ స్టేషన్లలో లేదా ఇంట్లో సులభంగా చార్జింగ్ చేసుకోవచ్చు.

ఈ బైక్ ఇంజన్ పర్ఫామెన్స్ బెటర్ మాత్రమే కాకుండా టెక్నాలజీ లోనూ లేటెస్ట్ వారిని ఆకట్టుకుంటుంది. ఇందులో ఆకర్షనీయంగా TFT డిస్ప్లే కనిపిస్తుంది. ఈ డిస్ప్లేలో బైక్ కు సంబంధించిన అన్ని వివరాలు నమోదు అవుతాయి. ముఖ్యంగా బైక్ పనితీరుతో పాటు స్పీడ్, మోడ్, బ్యాటరీ స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

సాధారణంగానే యమహా బైక్ అనగానే యూత్ ఇంప్రెస్ అవుతారు. అలాంటి వారిని ఆకర్షించే విధంగా బైక్ డిఫరెంట్ కలర్ లలో మార్కెట్లోకి రాబోతోంది. ఇది మార్కెట్లోకి వస్తే కాస్త ధర ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది మార్కెట్లోకి వస్తే డుకాటి మాన్స్టర్, ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ పంటి వాటితో పోటీ పడుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper