ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లకు కేంద్రం శుభవార్త చెప్పనుందా..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రజల ఆదాయం భారీగా తగ్గడంతో పాటు పాటు అదే సమయంలో ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రజలు ఆరోగ్యం కొరకు గతంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. కేంద్రం సైతం ప్యాకేజీలను ప్రకటించడం ద్వారా ఆర్థిక రంగం పుంజుకునేందుకు ప్రయత్నాలు చేసింది. Also Read: వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనకడుగు.. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో […]

Written By: Navya, Updated On : January 21, 2021 3:15 pm
Follow us on

దేశంలోని కోట్ల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రజల ఆదాయం భారీగా తగ్గడంతో పాటు పాటు అదే సమయంలో ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రజలు ఆరోగ్యం కొరకు గతంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. కేంద్రం సైతం ప్యాకేజీలను ప్రకటించడం ద్వారా ఆర్థిక రంగం పుంజుకునేందుకు ప్రయత్నాలు చేసింది.

Also Read: వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనకడుగు..

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల భారాన్ని తగ్గిస్తే బాగుంటుందని ఉద్యోగులు, వ్యాపారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్నును చెల్లించే వాళ్లకు శుభవార్త చెబితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను రాయితీలను కేంద్రం చెల్లిస్తుందో లేదో చూడాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విజృంభణ తరువాత ఆరోగ్య బీమా ప్రీమియం భారీగా పెరిగింది.

Also Read: రెండో విడతలో మొదటి టీకా మోడీకే..

ఆరోగ్య బీమా తీసుకునే వారిలో 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారికి 25,000 రూపాయలు, సీనియర్ సిటిజన్లకు 50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. పాలసీదారులు ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపును పెంచాలని కోరుకుంటున్నారు. గృహ బీమాను ప్రోత్సహించడానికి ప్రత్యేక సెక్షన్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. గృహ రుణ వడ్డీపై ఇస్తున్న 2 లక్షల రూపాయల పరిమితిని 4 లక్షల రూపాయలకు పెంచాలని వారు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

కరోనా పేరుతో ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక ప్రామాణిక తగ్గింపును అమలు చేయలని నిపుణులు సూచనలు చేస్తున్నారు. బీమా పాలసీలపై ఉన్న ప్రీమియంను 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ఈ నిర్ణయం ద్వారా బీమా పాలసీలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. సెక్షన్ 80సీకి సవరణలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. మరి కేంద్రం బడ్జెట్ లో ఏయే మార్పులు చేస్తుందో చూడాల్సి ఉంది.