కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల బెనిఫిట్స్ ను పొందాలని అనుకుంటే రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలనే సంగతి తెలిసిందే. ఎంతో కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటైన రేషన్ కార్డును కలిగి ఉండటం వల్ల సబ్సిడీ ధరకే రేషన్ సరుకులను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. రేషన్ కార్డును కలిగి ఉండని వాళ్లు కొన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశం అయితే ఉండదనే సంగతి తెలిసిందే.
రేషన్ కార్డులో వేర్వేరు రకాలు ఉండగా రేషన్ కార్డును బట్టి పొందే బెనిఫిట్స్ లో కూడా మార్పులు ఉంటాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మార్చి నెల వరకు ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఎవరైతే ప్రియారిటీ రేషన్ కార్డును కలిగి ఉంటారో వాళ్లు కేజీకి 3 రూపాయల చొప్పున కుటుంబంలోని ఒక్కొక్కరికి 5 కేజీలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పేద ప్రజలు అన్నపూర్ణ రేషన్ కార్డుల ద్వారా నెలకు ఒక్కొక్కరు పది కేజీల బియ్యం చొప్పున పొందవచ్చు. బీపీఎల్ రేషన్ కార్డులను తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు ఏపీఎల్ రేషన్ కార్డులను ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు మంజూరు చేస్తారు. అంత్యోదయ అన్నా యోజన రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు బియ్యంతో పాటు గోధుమలను కూడా పొందవచ్చు. నిరుపేదలు ఈ కార్డుకు అర్హులు.
అర్హతల ఆధారంగా రేషన్ కార్డులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత ఉండి రేషన్ కార్డ్ లేకపోతే సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవడం ద్వారా రేషన్ కార్డు ప్రయోజనాలను పొందవచ్చు.