పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. తక్కువ పెట్టుబడితో రూ.7 లక్షలు పొందే ఛాన్స్!

ప్రస్తుత కాలంలో పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రాబడి సొంతమవుతుంది. 60 సంవత్సరాల కంటే వయస్సు పైబడిన వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లకు […]

Written By: Kusuma Aggunna, Updated On : January 24, 2022 7:16 pm
Follow us on

ప్రస్తుత కాలంలో పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రాబడి సొంతమవుతుంది. 60 సంవత్సరాల కంటే వయస్సు పైబడిన వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లకు నెలకు కేవలం 8,334 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా ఐదేళ్ల తర్వాత ఏకంగా 7 లక్షల రూపాయలు పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున పొదుపు చేయడం ద్వారా ఐదేళ్ల తర్వాత ఏకంగా 2 లక్షల రూపాయల వరకు వడ్డీ రూపంలో లాభం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ పై ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ అమలవుతోంది.

ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ స్కీమ్ లో వడ్డీని లెక్కించడం జరుగుతుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో చేరేవాళ్లు ఇలాంటి స్కీమ్స్ ను ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో కళ్లు చెదిరే మొత్తాన్ని పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలని భావించే వాళ్లకు ఈ పోస్టాఫీస్ స్కీమ్ ఉత్తమమమైన స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు. వృద్ధులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ సేవింగ్స్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ కూడా ఉంటుంది.