https://oktelugu.com/

AP Employees: ఉద్యోగులకు గట్టి షాకిచ్చిన హైకోర్టు

AP Employees: సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వానికి కొండంత బలం వచ్చినట్టైంది. పీఆర్సీ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలోనే హైకోర్టు పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందన్న ఏజీ వ్యాఖ్యలతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2022 / 07:26 PM IST
    Follow us on

    AP Employees: సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వానికి కొండంత బలం వచ్చినట్టైంది. పీఆర్సీ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలోనే హైకోర్టు పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందన్న ఏజీ వ్యాఖ్యలతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

    Movie ticket prices issue

    ఏపీలో పీఆర్సీ అంశం వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీఆర్సీపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది.

    హెచ్ఆర్ఏ విభజన చట్టం ప్రకారం జరగలేదంటూ హైకోర్టు దృష్టికి ఉద్యోగులు తీసుకొచ్చారు. అయితే ఈ ఆరోపణలపై హైకోర్టు ఏకీభవించలేదు. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. మీకు ఎంత జీతం తగ్గిందో చెప్పాలని… అంకెల్లో ఈ లెక్కలు అందజేయాలని వ్యాఖ్యానించింది.

    పూర్తి డేటా లేకుండా కోర్టుకు ఎలా వస్తారని ప్రశ్నించింది. పర్సెంటేజిని ఛాలెంజ్ చేసే హక్కు మీకు లేదని తెలిపింది. ఈ పిటిషన్ కు చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ తన వాదలను వినిపిస్తూ… ఉద్యోగుల గ్రాస్ శాలరీ పెరిగిందని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన లెక్కలను అందించారు. దీంతో ఏపీ ఉద్యోగులకు షాకిస్తూ వారి జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందంటూ పేర్కొంది.

    న్యాయ పోరాటంలో ఉద్యోగులకు ఈ షాక్ తగిలినట్టైంది. ప్రభుత్వానికి ఇది బూస్ట్ లా పనిచేయనుంది. ఉద్యోగులు సమ్మె చేసినా భవిష్యత్తులో హైకోర్టులో నిలబడే చాన్సులు లేనట్టుగా ఉంది. దీంతో ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరించే ప్రమాదం లేకపోలేదు.