https://oktelugu.com/

Paytm: పేటీఎం యాప్ లో మన డబ్బుల పరిస్థితి ఏంటి..?

క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, డిపాజిట్ల సేకరణ వంటి పలు బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనుంది ఆర్బీఐ. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 8, 2024 / 11:53 AM IST

    Paytm

    Follow us on

    Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా..? అయితే మీకు ఈ విషయాలు తెలిసి ఉండాలి. అదేంటి? అనుకుంటున్నారా..? పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో ఖాతా ఉన్న వారికి రిజర్వ్ బ్యాంకు ఆష్ ఇండియా అలర్ట్ జారీ చేసింది. అదేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

    క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, డిపాజిట్ల సేకరణ వంటి పలు బ్యాంకింగ్ సేవలను నిలిపివేయనుంది ఆర్బీఐ. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఆర్బీఐ ఆదేశాల మేరకు క్రెడిట్ ట్రాన్సాక్షన్లు, టాపప్స్, డిపాజిట్లు తీసుకోవడం, పేటీఎం బ్యాలెన్స్ తో పాటు ఫాస్టాగ్ వంటి సేవలు ఈ నెల (ఫిబ్రవరి 29) 29 తరువాత నిలిచిపోనున్నాయి. అంటే మార్చి 1, 2024నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవలన్నీ ఆగిపోనున్నాయి.

    అయితే ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదు. పేటీఎంలో కేవలం పేమెంట్స్ బ్యాంకును మాత్రమే ఆర్బీఐ బ్యాన్ చేసింది. పేటీఎంలో ఉన్న కస్టమర్లు తమ తమ ఖాతాల్లోని బ్యాలెన్స్ ను ఉపయోగించుకోవడానికి ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. సేవింగ్స్ కానీ కరెంట్ అకౌంట్ లో తమ లిమిట్ ప్రకారం ఎలాంటి ఆంక్షలు లేకుండా తీసుకోవచ్చని తెలిపింది.

    పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పీబీబీఎల్ నోడల్ అకౌంట్లను ఆర్బీఐ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే నిర్దేశించిన తేదీ తరువాత కస్టమర్లకు చెందిన అకౌంట్లు, ప్రీపెయిడ్ వ్యాలెట్, ఫాస్టాగ్ మొదలైన వాటిలో ఏమైనా డిపాజిట్లు, క్రెడిట్ కార్డు లావాదేవీలు, టాప్ అప్ లు అనుమతించబడవు.

    అదేవిధగా క్యాష్ బ్యాక్, ఇతర రీఫండ్లకు మినహాయింపు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. సేవింగ్స్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, ప్రీపెయిడ్, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వంటి వాటితో సహా బ్యాంకు ఖాతాదారులకు తమ బ్యాలెన్స్ నుంచి విత్ డ్రా చేసుకోవడానికి, లేదా ఉపయోగించడానికి ఎలాంటి పరిమితులు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది.