MLA Rajasekhar Reddy
MLA Rajasekhar Reddy: “నేను ఎవరి భూములు కబ్జా చేయలేదు.. నా దగ్గర రికార్డులు ఉన్నాయి.. కమాన్ రేవంత్.. చూసుకుందాం.. నీ చరిత్ర, నా చరిత్ర” అప్పుడు ఇలానే కదా పాల మల్లారెడ్డి అలియాస్ కార్మిక శాఖ మాజీ మంత్రి మల్లారెడ్డి సవాల్ చేసింది. అలా సవాల్ చేసిన కొద్ది సంవత్సరాలకే మంత్రి మల్లారెడ్డి కాస్త ఎమ్మెల్యే అయితే అయ్యారు కానీ మాజీ మంత్రి అయ్యారు. అప్పటి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకేముంది ఆట మొదలుపెట్టారు.. మల్లారెడ్డి హెచ్ఎండీఏ భూములను ఆక్రమించి నిర్మించిన రోడ్డును తొలగించారు. అది జరిగి మూడు రోజులు కాకముందే గురువారం మరో చర్యకు పాల్పడ్డారు.
చెరువును కబ్జా చేసి కట్టారని..
దుండిగల్ ప్రాంతంలో మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి ఎంఎల్ఐటీ పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ కాలేజీ దుండిగల్ ప్రాంతంలో ఉన్న చిన్న దామరచెరువును కబ్జా చేసి కట్టారని ఎప్పటి నుంచో అభియోగం ఉంది. ఈ కాలేజీ నిర్మాణపై గతంలో మల్లారెడ్డి అల్లుడు పై రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు. అప్పట్లో అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ మల్లారెడ్డి మంత్రిగా ఉండడం, భారత రాష్ట్ర సమితి అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో.. వారు రంగంలోకి దిగారు. గత కొద్దిరోజులుగా కీలక రికార్డులను పరిశీలించి.. గురువారం చర్యలకు ఉపక్రమించారు.
ఉద్రిక్తత
దుండిగల్ ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఎంఎల్ఐటీ, ఏరోనాటికల్ కాలేజీ భవనాలను కూల్చేశారు. పెద్ద పెద్ద బుల్డోజర్లతో అధికారులు ఉదయమే అక్కడికి చేరుకొని ఆ భవనాలను నేలమట్టం చేశారు. ఈ భవనాలను కూల్చి వేస్తున్నప్పటికీ అక్కడికి సంబంధిత కళాశాల యాజమాన్యం రాకపోవడం విశేషం.ఈ కూల్చివేతలను ఆ కళాశాల విద్యార్థులు అడ్డుకోవడం గమనార్హం. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.. సాయంత్రం వరకు కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఓ వర్గం మీడియా మల్లారెడ్డికి వంత పాడటం విశేషం.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాలు కూల్చివేత
దుండిగల్ – మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏరోనాటికల్ కాలేజీ భవనాలను కూల్చివేస్తున్న అధికారులు.. చిన్న దామర చెరువు కబ్జా చేసి భవనాలు… pic.twitter.com/hKxtOPsmP9
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2024