Maruti Suzuki WagonR: Maruthi Suzuki కంపెనీకి చెందిన కార్లు మార్కెట్లోకి వస్తున్నాయంటే చాలా మందికి ఉత్సాహం ఉంటుంది. ఎందుకుంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం ఈ కంపెనీ కారు కొనే విధంగా అనుగుణంగా ఉంటుంది. అలా ఇప్పటి వరకు వచ్చిన కార్లలో Wagon R గురించి కారు నడిపే వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దశాబ్దాలుగా ఈ కారుకు ఆదరణ పెరగడమే కానీ తగ్గడం లేదు. అయితే ఈ మోడల్ ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మారుతోంది. తాజాగా వ్యాగన్ ఆర్ అప్డేట్ వెర్షన్ తో మార్కెట్లోకి వచ్చింది. ఇంజిన్ తో పాటు మైలేజ్ విషయంలో ఈ మోడల్ లో మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కారు వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మారుతి వ్యాగన్ ఆర్ 2026 కారులో 1.2 లీటర్ డ్యూయెల్ జెట్ ఇంజిన్ ను అమర్చారు. ఇది సెగ్మెంట్ లీడింగ్ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ లీటర్ ఇంధనానికి 38 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది 89 పీఎస్ పవర్ అందిస్తూ పెద్ద కార్లతో పోటీ పడుతోంది. అలాగే ఇందులో 113 ఎన్ ఎం టార్క్ రిలీజ్ చేస్తుంది. సున్నితమైన గేర్ వ్యవస్థ ఉండడంతో కొత్తగా కారు కొనేవారికి సౌకర్యంగా ఉంటుంది. నగరంలో ఉండేవారి కోసం 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటో గేర్ షిప్ట్ ఆప్షన్ ను అమర్చారు. పట్టణాలు, నగరాల్లో ఉండేవారితో పాటు లాంగ్ డ్రైవ్ చేసేవారికి వ్యాగర్ ఆర్ 2026 అనుగుణంగా ఉంటుంది.
మిగతా కార్లతో పోలీస్తే పాత వ్యాగన్ ఆర్ డిజైన్ పరంగా పెద్దగా ఆకట్టుకోదు. కానీ ఈ కొత్త మోడల్ మాత్రం ఆకర్షణీయమైన డిజైన్ లో కనిపిస్తోంది. టాల్ బాయ్ స్టాన్స్ తో పాటు బోల్డ్ డిజైన్ ఉండడంతో లుకింగ్ ది బెస్ట్ అంటున్నారు. క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, డ్యూయల్ టోన్ బంపర్లు, ఎల్ ఈడీ ల్యాప్ లను చూస్తే ప్రీమియం కారును టచ్ చేస్తాయి. గతంలో కంటే ఇప్పుడు కారులో విశాలమైన క్యాబిన్ ను అమర్చారు. ఆండ్రాయిడ్ ఆటో తో పాటు ఆపిల్ కార్ డిస్ ప్లే తో కూడిన 7 అంగుళాల స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పనిచేసే డ్యూయెల్ డ్యాష్ బోర్డును కలిగి ఉంది.
కొత్త వ్యాగన్ ఆర్ కారు భద్రతలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. EBDతో కూడిన ABS రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏజీఎస్ వేరియంట్ లో హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ తో పాటు సీట్ బెల్ట్ రిమైండర్ ను కలిగి ఉంటుంది. ఈకారు ప్రస్తుతం మార్కెట్లో రూ.7.89 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈఎంఐ ద్వారాకూడా కారును కొనుగోలు చేసే సౌకర్యాలు ఉన్నాయి.