https://oktelugu.com/

NFO Investments: NFO పెట్టుబడులు అంటే ఏమిటి? ఇందులో ఎలాంటి లాభాలు వస్తాయి?

స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉన్న వారికి NFO గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. కానీ కొత్త వారు మాత్రం ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పటివరకు చాలా మంది రకరకాల ఇన్సూరెన్స్ లు చేసి ఉంటాయి. కొందరు లైఫ్ ఇన్సూరెన్స్ లో పెట్టుబడులు పెడితే అవి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండదు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 31, 2024 / 05:17 PM IST

    NFO Investments

    Follow us on

    NFO Investments: నేటి కాలంలో ప్రతి ఒక్కరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో అధిక ఆదాయం కోసం రకరకాల ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. కానీ ఇవి సాధ్యం కాని వారి కొన్ని పెట్టుబడులు పెడుతున్నారు. చిట్టీలు, బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే కొన్ని రకాల అధికా ఆదాయం వచ్చే ఇన్వెస్ట్ మెంట్లు ఉన్నాయి. అయితే ఇవి తాత్కాలికంగా ప్రయోజనాలు కల్పించకపోవచ్చు. కానీ భవిష్యత్ లో మంచి లాభాలు ఇస్తాయి. అంతేకాకుండా ఈరోజుల్లో ఇన్సూరెన్స్ తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా దీనితో పాటు రిటర్న్స్ వచ్చే ఓ మార్గం ఉంది. అదే NFO ఇన్వెస్ట్ మెంట్. మరి NFO అంటే ఏమిటి? ఇందులో ఎలాంటి పెట్టుబడులు పెట్టొచ్చు? ఎలాంటి లాభాలు వస్తాయి?

    స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉన్న వారికి NFO గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. కానీ కొత్త వారు మాత్రం ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పటివరకు చాలా మంది రకరకాల ఇన్సూరెన్స్ లు చేసి ఉంటాయి. కొందరు లైఫ్ ఇన్సూరెన్స్ లో పెట్టుబడులు పెడితే అవి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండదు. కానీ ఏదైనా రిస్క్ జరిగితే మాత్రం అమౌంట్ వస్తుంది. అయితే బతికున్నంత కాలం ఎలాంటి రిటర్న్స్ ఇవ్వరు.

    రిటర్న్స్ రావాలనుకునేవారు బ్యాంకుల్లో పెట్టుబడులు పెడుతారు. అయితే ఇందులో ఇన్సూరెన్స్ కు అవకాశం ఉండదు. అలాగే ఎమర్జెన్సీ సమయంలో ఇది ఉపయోగపడదు. అందువల్ల రిటర్న్స్ రావడంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రెండూ కలగలిపి అవకాశం కల్పిస్తుంది NFO. ఇదొక యూటిలిటీ ఫండ్. ఇందులో పెట్టుబడులు పెట్టడం వల్ల ఓ వైపు ఇన్సూరెన్స్ ఉండడంతో పాటు మరోవైపు రిటర్న్స్ కూడా వస్తాయి.

    ఇన్సూరెన్స్ అనగానే చాలా మంది రిటర్న్స్ రావనే ఉద్దేశంతో వెనుకడుగు వేస్తారు. కానీ NFOలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఓ వైపు వడ్డీ రావడంతో పాటు మరో వైపు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అయితే ఇందులో పెట్టుబడిని రకరకాలుగా చేయొచ్చు. నెలనెలా కొంత మొత్తం లేదా ఒకేసారి ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. నెలనెలా చేయాలనుకుంటే మాత్రం మినిమం రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది.