Sell Your Car: కారు ఒకప్పుడు సంపన్నుల వాహనం. కానీ ఇప్పుడు కారు నిత్యావసరం. ఇక కొంతమందికి కారు ఫ్యాషన్. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన కార్లను కొనుగోలు చేస్తుంటారు. పాతకారును అమ్మేస్తారు. ఇక కొందరు ఫ్యాషన్ లేకపోయినా కంఫర్ట్ కోసం కొత్త కార్లు కొంటంటారు. ఇప్పటికే ఉన్న పాతకారు అమ్మేయాలని చూస్తారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మీ పాతకారును కూడా మంచి ధరకు అమ్మవచ్చని అంటున్నారు మార్కెట్ నిపుణులు.
మైనర్ డ్యామేజ్‌లు ఉంటే..
కారు అమ్మే ప్రక్రియ ప్రారంభించే ముందు వెహికిల్‌ను ప్రాపర్‌గా ప్రిపేర్ చేయాలి. చిన్న డ్యామేజీలు ఉన్నా స్క్రాచ్‌లు ఉన్నా రిపేర్ చేయించాలి. ఇలా చేయడం వలన రీసేల్ వ్యాల్యూ పెరుగుతుంది. కారు ఆకర్షణ, రీసేల్ వ్యాల్యూ పెంచడానికి టైర్లు, బ్రేక్‌లు వంటి అరిగిపోయిన పార్ట్స్ మార్చాలి.
కారు శుభ్రంగా ఉంచాలి..
ఇక కారును క్రమం తప్పకుండా క్లీన్ చేయడం వలన లుకింగ్ బాగుంటుంది. రీసేల్ వ్యాల్యూ పెరుగుతుంది. క్లీన్‌గా ఉండే కారు కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. అందుకే క్రమం తప్పకుండా వాష్ చేయడం, అవసమైనప్పుడు కవర్ వేయడం వంటివి చేయాలి.
క్రమం తప్పకుండా సర్వీసింగ్..
ఇక కార్లకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. ఇలా చేయడం వలన వెహికల్ హెల్త్, రీసేల్ వ్యాల్యూ పెరుగుతుంది. రొటీన్ మెయింటనెన్స్‌లో భాగంగా ఆయిల్ ఛేంజ్, ఫ్లూయిడ్ రీఫిల్స్, టైర్ రొటేషన్ బ్రేక్ రీప్లేస్‌మెంట్ చేయించాలి.
సర్వీస్ హిస్టరీ
కారును మంచి కండీషన్‌లో ఉంచడానికి, రీసేల్ విలువ పెంచడానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్‌తోపాటు సర్వీస్ హిస్టరీ రికార్డు మెయింటేన్ చేయాలి. ఇది సెల్లింగ్ ప్రాసెస్‌ను ఈజీ చేస్తుంది. కొనుగోలుదారులకు విలువైన డాక్యుమెంటేషన్‌ను కూడా అందిస్తుంది. ఇక టైటిల్ పేపర్లు, రసీదులు, సంబంధిత పేపర్‌వర్క్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
అప్‌డేట్ చేయాలి..
కారుకు బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్, రియర్-వ్యూ కెమెరా లేదా నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అడిషినల్ ఫీచర్‌లను కారుకు యాడ్ చేయండి. ఇలాంటివి కారు రీసేల్ వ్యాల్యూ పెంచుతాయి. కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి.
ఇంటీరియర్ కేర్
కొనుగోలుదారులు కారు కొనేముందు బయటి లుక్‌తోపాటు ఇంటీరియర్ లుక్‌ను పరిశీలిస్తారు. పాత కారును విక్రయించేటప్పుడు క్యాబిన్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. కార్పెట్‌లు, మ్యాట్‌లు, సీటు కవర్లు శుభ్రంగా ఉంచాలి. మంచి సువాసన వచే‍్చలా చూసుకోవాలి.