https://oktelugu.com/

Sunroof cars : సన్ రూఫ్ ఫీచర్ తో తక్కువ బడ్జెట్ కార్లు కొనాలనుకుంటున్నారా..? టాప్ మోడల్స్ ఇవే..

సన్ రూఫ్ ప్రత్యేకంగా ఉన్న ఫీచర్ కారు ధర కాస్త ఎక్కువగా ఉండేది. కానీ హ్యుందాయ్ తో పాటు మరికొన్ని కంపెనీలు ఈ ఫీచర్ ఉన్న కారును లో బడ్జెట్ లో అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం సన్ రూఫ్ వేరియంట్ లో ఇవి బెస్ట్ కార్లుగా నిలుస్తున్నాయి. ఆ కార్లు ఏవంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : August 21, 2024 / 04:01 PM IST

    Sunroof Cars

    Follow us on

    Sunroof cars : కాలం మారుతున్న కొద్దీ కార్లు కొనేవారి అభిప్రాయాలు మారుతున్నాయి. ఒకప్పుడు 4 సీటర్ ఉన్న చిన్న కారును కొనాలని చూసేవారు. కానీ ఇప్పుడు హోదాకు తగిన విధంగా 4 వెహికల్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మాత్రం సన్ రూప్ కారు. మిగతా కార్ల కంటే సన్ రూప్ కారు బెస్ట్ వెంటిలేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే టాప్ ఓపెన్ చేసి డ్రైవింగ్ చేయడం కొందరు కొత్తగా అనుభూతి పొందుతారు. అయితే సన్ రూఫ్ ప్రత్యేకంగా ఉన్న ఫీచర్ కారు ధర కాస్త ఎక్కువగా ఉండేది. కానీ హ్యుందాయ్ తో పాటు మరికొన్ని కంపెనీలు ఈ ఫీచర్ ఉన్న కారును లో బడ్జెట్ లో అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం సన్ రూఫ్ వేరియంట్ లో ఇవి బెస్ట్ కార్లుగా నిలుస్తున్నాయి. ఆ కార్లు ఏవంటే?

    భారత దేశంలో కార్లను కోరుకునే వారిలో సన్ రూఫ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫీచర్ కలిగి ఉండి టాప్ లెవల్లో సేల్స్ నమోదు చేసుకున్న కారు XUV 3×0.మహీంద్రా కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఈ ఎస్ యూవీ కారు ఫీచర్స్ అదిరిపోయాయి. వీటితో పాటు సన్ రూఫ్ విషయంలో ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్ ఉన్న ఈ కారును రూ. 7.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే ఇందులో ప్రో వే వేరియంట్ మాత్రం రూ.8.99 లక్షల ధర ఉంది.

    ఆకట్టుకునే ఫీచర్లతో కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో హ్యుందాయ్ ముందు ఉంటుంది. ఈ క్రమంలో హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన వెన్యూ ఎస్ యూవీకి వినియోగాదరణ ఎక్కువగానే ఉంది. ఈ కారులో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ను పొందవచ్చు. ఈ మోడల్ కారు గత వారమే మార్కెట్లోకి వచ్చింది. దీనిని రూ.9.36 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే వెన్యూ ట్రిమ్ సైతం సన్ రూఫ్ తో ఉంది. దీనిని రూ. 10 లక్షల ధరతో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీకి చెందిన ఎక్స్ టర్ సైతం సన్ రూఫ్ ను కలిగి ఉంది. దీనిని రూ.8జ23 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    టాటా కంపెనీకి చెదిన ఎస్ యూవీ కార్లు మార్కెట్లో అత్యధికంగా అమ్మకాలు అందుకున్నాయి. అయితే సన్ రూఫ్ ఫీచర్స్ తో టాటా నుంచి పంచ్ మార్కెట్లోకి వచ్చింది. దీనిని రూ. 6.12 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అయితే టాటా పంచ్ ఎలక్రిక్ సన్ రూఫ్ ఫీచర్ కావాలంటే మాత్రం రూ.8.34 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

    దేశంలో కియా కార్లు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా సోనెట్ బెస్ట్ కారుగా నిలిచింది. అయితే సోనెట్ ను సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీనికి అదనంగా సన్ రూఫ్ పీచర్ ను యాడ్ చేశారు. దీతో కియా సోనెట్ సన్ రూఫ్ కారును రూ.8.19 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ కారు రూ.15.75 లక్సల వరకు ఉంది.