New Phone: మానవ జీవితంలో మొబైల్ ప్రధానమైపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు చాలా రకాల పనులను మొబైల్ తోనే చేస్తున్నారు. కొందరు ఉపాధి సైతం ఫోన్ తోనే పొందుతున్నారు. అయితే ఈ మొబైల్ ను ఎప్పటికప్పడు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మార్కెట్లోకి అప్డేట్ మొబైల్ వస్తే పాత మొబైల్ ను తీసేసి దాని స్థానంలో కొత్తది కొనుగోలు చేయడం మంచిది. అయితే కొత్త మొబైల్ ను ఎప్పుడు పడితే అప్పుడు కొనడం ఎంత మాత్రం మంచిది కాదు. ప్రస్తుత సమయంలో కొనడం అస్సలు కరెక్ట్ కాదు. మరి కొత్త మొబైల్ ఎప్పుడు కొనాలి? ఇప్పడు కొంటే ఏమవుతుంది? ఎప్పడు కొంటే మంచిది?
కొత్తగా మొబైల్ కొనుగోలు చేయాలని అనుకునేవారు.. పాత మొబైల్ స్థానంలో కొత్తదానిని తీసుకోవాలని అనుకనేవారికి ఇది శుభవార్తే అని చెప్పుకోవచ్చ. ఎందుకంటే ఇటీవలే నిర్వహించిన GST కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాల వల్ల మొబైల్స్ ధరలు భారీగా తగ్గనున్నాయి. సెప్టెంబర్ 22 తరువాత మొబైల్ కొనుగోలు చేయడం వల్ల ఎన్నో రకాల లభాలు ఉన్నాయని చాలా మంది ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఫోన్లపై 28 శాతం జీఎస్టీ ఉండేది. అంటే రూ.25,000 మొబైల్ కొనుగోలు చేస్తే దీనిపై 28 శాతం అంటే రూ.7,000 అదనంగా చెల్లించాల్సి వచ్చేది. అంటే రూ.32,000 వరకు ధర ఉండేది. కానీ సెప్టెంబర్ 22 నుంచి వీటిపై 5 శాతం వరకు తగ్గించనున్నారు. అంటే రూ.25,000 మొబైల్ ఉంటే దీనిపై రూ.1,200 అదనంగా పడుతుంది. అంటే దాదాపు రూ.5,000 వరకు సేవ్ చేసకోవచ్చ.
ఇప్పటి వరకు ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంతకంటే కూడా తక్కువ ధరకు మొబైల్ కొనుగోల చేసే అవకాశం రాబోతుంది. అదేంటంటే ఇటీవలే వినాయక ఫెస్టివల్స్ ఫూర్తయింది. ఇప్పుడు ఇక దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు రాబోతున్నాయి. ఈ పండుగల సందర్భంగా కొన్ని మొబైల్స్ పై ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు ఉన్న ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. అంటే ఓ వైపు జీఎస్టీ తగ్గింపుతో పాటు మరోవైపు.. ఆఫర్ వర్తిస్తే.. మొబైల్ ధర తగ్గే అవకాశం ఉంది.
అందువల్ల పండుగల సీజన్ వచ్చే వరకు మొబైల్ కొనుగోలు చేయకండి. ఈ సమయంలో మొబైల్ కొనుగోలు చేస్తే ఎంతో లాభపడుతారు. మొబైల్స్ మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా జీఎస్టీని భారీగా తగ్గించారు. దీంతో వాటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. పండుగల సందర్భంగా ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేయాలని అనుకునేవారు.. దసరా లేదా దీపావళి వరకు వేచి ఉంటే తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేయొచ్చు.