Child Care: ఇటీవల కొంతమంది రాజకీయ నాయకులు పేర్కొంటున్న ప్రకారం భారతదేశంలో జననాల రేటు తగ్గి మరణాల రేటు పెరుగుతుందని తెలుస్తోంది. అయితే మరణాల రేటు పెరిగి జననాల రేటు తగ్గడానికి పోషక భారమే కారణమని తెలుస్తోంది. పుట్టిన పిల్లవాడి నుంచి పెంచి పెద్ద చేసి వారికి పెళ్లిలు చేసే వరకు ఎన్నో రకాల ఖర్చులు ఉంటున్నాయి. ఈ ఖర్చులకు భయపడే చాలామంది ఇద్దరు కంటే ఎక్కువగా పిల్లల్ని కనడం లేదని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే ఒకప్పుడు ఒక ఇంట్లో 6 నుంచి 8 మంది పిల్లలు ఉన్నా.. వారందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అంతేకాకుండా అందరూ కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలతోనే బతుకు నడవడం కష్టంగా మారుతుంది. అందుకు కారణం ఎవరు అంటే?
20వ శతాబ్దం వరకు ప్రతి దంపతులు ముగ్గురు పిల్లలను కనేవారు. వారిని ఎంతో ఆరోగ్యంగా పెంచి పెద్ద చేసేవారు. అంతేకాకుండా ఆ తర్వాత కూడా వారి బాగోగులు చూసుకునే అంతా సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలను కానీ వారిని చదివించాలంటేనే కష్టంగా మారుతుంది. ఎందుకు ప్రధాన కారణంగా రాజకీయ వ్యవస్థ అని చెప్పుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు తమ ధన లాభం కోసం ప్రభుత్వపరంగా అందాల్సిన సౌకర్యాలను ప్రైవేటుగా సమకూర్చి వాటికి ఎక్కువగా డబ్బులు లాగేస్తున్నారు.
ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలు మాత్రమే ఉండేవి. జననాలు ఈ ఆస్పత్రిలోనే జరిగేవి. ఒక బిడ్డ జన్మించడానికి ఏమాత్రం ఖర్చు ఉండేది కాదు. ఏదైనా సీరియస్ అయితే తప్ప ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడమే. కొందరు రాజకీయ నాయకులు సొంతంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేకుండా చేయడం వల్ల చాలామంది ప్రైవేట్ ఆస్పత్రుల్లోకి వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఒక బిడ్డను కొనడానికి లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఒక బిడ్డ పుట్టడానికే లక్ష రూపాయల ఖర్చు అయితే.. ఆ బిడ్డ పెరిగి పెద్దయి చదువుకునే వరకు ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది.
అలాగే విద్యా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో ఉండే రోజుల నుంచి ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే కనిపించే రోజులు వచ్చాయి. ఇందులో ఎల్కేజీ పిల్లవాడికి వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి డిగ్రీ వచ్చేసరికి తమ తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలా ఉన్నదంతా ఊడ్చి తమ పిల్లలకు ఇవ్వడం వల్ల వారు తమ జీవితాలను చక్కబెట్టుకోవడానికే కష్టపడుతున్నారు. ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులను పట్టించుకోని ఆదాయం రావడం లేదు.
ప్రభుత్వాలు విద్య, వైద్యం ఉచితంగా కల్పించాల్సి ఉండగా.. వాటి గురించి పట్టించుకోకుండా జననాల రేటు తగ్గుతోందని ప్రకటనలు చేయడం ఏమాత్రం సమంజసం అని కొందరు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తే పిల్లల్ని కనడానికి ఏ తల్లిదండ్రులు అయినా ఇష్టపడతారు. ప్రస్తుతం ఖర్చులు, అవసరాలు విపరీతంగా పెరిగిపోవడంతో పిల్లల పోషణ భారం ఎక్కువవుతుంది. అందుకే జననాల రేటు తగ్గుతుంది అని తెలుస్తుంది.